Best 7-Seater CNG Cars: తక్కువ ధర .. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ 7 సీటర్ కారు ఇదే! ఎగబడి కొంటున్న జనాలు

Cheap & Best 7-Seater Cars 2023: సీఎన్జీతో వచ్చే సెవెన్ సీటర్స్ కార్లు భారత్ మార్కెట్లో తక్కువగానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో బెస్ట్ అంటే మారుతి సుజుకి ఎర్టిగా అనే చెప్పాలి. దీని ధర, ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 08:16 AM IST
Best 7-Seater CNG Cars: తక్కువ ధర .. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ 7 సీటర్ కారు ఇదే! ఎగబడి కొంటున్న జనాలు

Cheap and Best 7-Seater CNG Cars: ఎక్కువ మైలేజీ, తక్కువ పొల్యూషన్ ఇచ్చే వెహికల్స్ లో సీఎన్జీ కార్లు ముఖ్యమైనవి. ఈ కార్లలో ఎక్కువగా 5 సీట్లు ఉండే వాహనాలే మార్కెట్లో  సందడి చేస్తాయి. 7 సీటర్స్ రేర్ గా ఉంటాయి. ఇలాంటి వాటిల్లో మారుతి సుజుకి ఎర్టిగా బెస్ట్ అనే చెప్పాలి. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే సెవెన్ సీటర్ కారు. ఇది 26 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

మారుతీ సుజుకి ఎర్టిగా 
ఎర్టిగా సిఎన్‌జి 1.5-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 807 బిహెచ్‌పి పవర్ మరియు 121 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటర్ కు 26.11 కిమీ వరకు మైలేజీని ఇస్తుంది. మారుతీ సుజుకి ఎర్టిగా సిఎన్‌జి ధర భారత మార్కెట్లో రూ.10.44 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 

మారుతీ సుజుకి XL6
ఈ జాబితాలో రెండో కారు కూడా మారుతిదే. ఈ సెవెన్ సీటర్ కారు మారుతి సుజుకి XL6 అనే పేరుతో మార్కెట్లో సందడి చేస్తుంది. ఈ కారులో ఎర్టిగా కంటే మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. అయిటే 6 సీట్లతో వస్తుంది. రేటు కూడా ఎర్టిగా కంటే ఎక్కువ.  ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటర్ కు  26.32 కిలోమీటర్లు మైలేజీని ఇస్తుంది. మారుతి XL6 CNG ధర రూ. 12.24 లక్షలు. 

Also Read: Forbes list 2023: ఆసియా కుబేరుడిగా మళ్లీ ముకేష్ అంబానీ, ఫోర్బ్స్ జాబితా నుంచి అదానీ అవుట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News