Hanuman Jayanti 2023 Tithi, Shubh Muhuratam & Puja Vidhanam: హిందువులు అందరూ హనుమాన్ జయంతిని చైత్ర పూర్ణిమ రోజున ఘనంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, హనుమంతుడిది రుద్రావతారం. ఆయన మంగళవారం చైత్ర పూర్ణిమ నాడు జన్మించారు. అతని తండ్రి పేరు వానరరాజ్ కేసరి, తల్లి పేరు అంజన. హనుమంతుడు రాముడికి సేవ చేయడానికి, రావణుడు అపహరించిన సీతా మాతను కనుగొనడంలో సహాయం చేయడానికి అవతారం ఎత్తారు. ఇక ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు? శని దోషం తొలగిపోవడానికి హనుమాన్ జయంతి రోజున ఎలాంటి పూజలు చేయాలి? వాటి ఉపాయాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం చైత్ర పూర్ణిమ తిథి ఏప్రిల్ 05, బుధవారం ఉదయం 09:19 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 06, గురువారం ఉదయం 10:04 గంటలకు ముగుస్తుంది. అందుకే హనుమాన్ జయంతిని 06 ఏప్రిల్ గురువారం ఉదయం తిథి ఆధారంగా జరుపుకుంటారు. ఆ రోజున ఉపవాసం పాటించి బజరంగబలిని పూజిస్తారు భక్తులు.
హనుమాన్ జయంతి 2023 పూజ ముహూర్తం:
హనుమాన్ జయంతి రోజున ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 06:06 నుండి 07:40 వరకు పూజలు చేయవచ్చు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:24 నుంచి 01:58 వరకు కూడా ఆయనకు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూజ చేయాలనుకునే వారు సాయంత్రం 05.07 నుండి 08.07 మధ్యలో చేయవచ్చని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఇక హనుమాన్ జయంతి రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం 11.59 నుండి 12.49 వరకు ఉంది.
హనుమాన్ జయంతి పూజా విధి:
హనుమాన్ ని ఆరాధించడానికి, ఎర్రటి పువ్వులు, సింధూరం, అక్షితలు, తాంబూలం, మోతీచూర్ లడ్డూలు, ఎరుపు రంగు గుడ్డలు మొదలైనవి సమర్పించండి. ఇక అదేరోజున హనుమాన్ చాలీసా పఠించాల్సి ఉంటుంది. నిరంతరం హనుమాన్ మంత్రాన్ని జపిస్తూ హనుమంతుని హారతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే ఆ హనుమంతుని అనుగ్రహంతో, మీ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని, మీ కష్టాలు తొలగిపోతాయని చెబుతారు పెద్దలు.
హనుమాన్ జయంతి ఉపాయాలు:
హనుమాన్ కి సింధూరం అంటే చాలా ఇష్టం. అందుకే కష్టాలు తొలగిపోవడానికి హనుమాన్ జయంతి రోజున ఆయనకు సింధూరం సమర్పించడం చాలా శ్రేయస్కరం. హనుమాన్ సంతోషించి ఆరోగ్యం, సంతోషం సహా శ్రేయస్సును అనుగ్రహిస్తాడు. అంతేకాదు అలా చేస్తే శని చెడు దృష్టిని కూడా తొలగిస్తుందని ఒక నమ్మకం. ఇక హనుమాన్ జయంతి రోజు సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్లి అగరవత్తులు వెలిగించి గులాబీ మాల సమర్పించడం శ్రేయస్కరం. దీనితో పాటు ఆవనూనె దీపం వెలిగించి 11 సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే శని దోషం తొలగిపోతుందని అంటారు. ఇక అదే రోజు హనుమాన్ ఆలయంలోని శ్రీరాముడు, సీతమాత, హనుమాన్ విగ్రహాలను సందర్శించేటప్పుడు రామరక్షా స్తోత్రాన్ని పఠించాలట. అలా చేయడం వల్ల బజరంగబలి అనుగ్రహం లభిస్తుందని, శని దోషం నుండి ఉపశమనం పొందే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: Viduthalai Part 1 Telugu Release: తమిళ్లో సూపర్ హిట్ అయిన విడుతలై.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook