Heart Attack Reasons: మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అంగం గుండె. ఇది ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణాలు నిలబడతాయి. గత కొద్దికాలంగా చిన్నా పెద్దా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అన్నింటికీ కారణం ఒకటే. గుండె పోటు. ఈ పరిస్థితికి కారణమేంటి, ఏం చేయాలి..
మనిషి అనారోగ్యానికి, వివిధ రకాల సమస్యలన్నింటికీ కారణం ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. ఈ రెండింటి వల్లనే ఇటీవలికాలంలో గుండెపోటు కేసులు అధికమయ్యాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చిన్న వయస్సుకే గుండెజబ్బులకు లోనవుతున్నారు. గుండె శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరా చేస్తుంటుంది. రక్తం ప్రవహించే నాళాల్లో కొవ్వు పేరుకుపోతే..సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా గుండెపోటు వస్తుంది. చాలామందికి హార్ట్ ఎటాక్ వచ్చేవరికి తెలియదు. ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంటారు. ఈ పరిస్థితుల్లో తక్షణం ఆసుపత్రికి తరలిస్తే బతికే అవకాశాలుంటాయి. ముఖ్యంగా హార్ట్ బీట్ సౌండ్ తేడాగా ఉన్నా, మెడ నుంచి వెన్ను వరకూ నొప్పి, తలనొప్పి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
జీవనశైలిని సక్రమంగా ఉంచుకుంటే చాలావరకూ గుండెపోటు సమస్యను తగ్గించవచ్చు. తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైందిగా ఉండాలి. వ్యాయామం తగినంతగా ఉండాలి. రోజుకు కనీసం 7-8 గంటలు రాత్రి నిద్ర తప్పనిసరి. ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. తినే తిండిలో ఉప్పు, మసాలా, కారం తగ్గించాలి. ఉప్పును సాధ్యమైనంతవరకూ మానేస్తే మంచిది.
రోజూ తీసుకునే ఆహార పదార్ధాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. రక్తపోటు సమస్య ఉన్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. మైదాను పూర్తిగా మానేయాలి. సమయానికి భోజనం, సమయానికి నిద్ర ఉండేట్టు చూసుకోవాలి. చెడు ఆహారపు అలవాట్లు దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం జోలికి వెళ్లకూడదు. డైట్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకూ గుండెపోట్లకు దూరంగా ఉండవచ్చు.
Also read: Covid19 Cases in India: కలవరం కల్గిస్తున్న కోవిడ్19, గత 24 గంటల్లో 3 వేల కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook