Mumbai Indians Captain Rohit Sharma hold the record of most ducks in IPL: ఐపీఎల్ 2023కి సమయం ఆసన్నమైంది. మరో 2 రోజుల్లో మెగా టోర్నీకి తెర లేవనుంది. మార్చి 31న అహ్మాదాబాద్ వేదికగా జరిగే లీగ్ తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉంది. గత రెండు సీజన్లలో తేలిపోయిన ముంబై.. ఈసారి పుంజుకోవాలని చూస్తోంది. అంతేకాదు టైటిల్ కూడా గెలవాలని కెప్టెన్ రోహిత్ శర్మ చూస్తున్నాడు.
ఐపీఎల్లో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు 5 టైటిల్స్ అందించి రికార్డుల్లో నిలిచాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే రోహిత్ శర్మ పేరుపై ఓ అత్యంత చెత్త రికార్డు కూడా ఉంది. మెగా లీగ్‌లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్ రోహిత్. 2008లో జరిగిన తొలి సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న రోహిత్.. ఇప్పటివరకు 14సార్లు డకౌటయ్యాడు. అత్యధిక డకౌట్స్ లిస్టులో రోహిత్ అగ్రస్థానంలో ఉండడం విశేషం. అత్యధిక పరుగులు, సిక్సులు సెంచరీల రికార్డులతో పాటు రోహిత్ పేరిట ఈ డకౌట్స్ రికార్డు కూడా ఉంది.
ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన లిస్టులో మణ్‌దీప్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. మణ్‌దీప్ సింగ్ కూడా 14 సార్లు డకౌటయ్యాడు. టాప్ 10 జాబితా చూస్తే.. విదేశీ ప్లేయర్స్ కంటే భారత ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. టాప్ 10 లిస్టులో మొదటి 8 మంది భారత బ్యాటర్లే కావడం విశేషం. రోహిత్ శర్మతో పాటు మణ్‌దీప్ సింగ్, పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, అజింక్య రహానే, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఈ లిస్టులో ఉన్నారు. రషీద్ ఖాన్, సునీల్ నరైన్ మాత్రమే విదేశీ ఆటగాళ్లు.
ఐపీఎల్లో అత్యధిక డకౌట్స్ లిస్ట్:
రోహిత్ శర్మ - 14
మణ్‌దీప్ సింగ్ - 14
పియూష్ చావ్లా - 13
హర్భజన్ సింగ్ - 13
పార్థివ్ పటేల్ - 13
అజింక్య రహానే - 13
అంబటి రాయుడు - 13
దినేష్ కార్తీక్ - 13
రషీద్ ఖాన్ - 12
సునీల్ నరైన్ - 12
Also Read: Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌కు లక్కీ ఛాన్స్.. ముంబై తుది జట్టులో చోటు! స్టార్ ప్లేయర్ స్థానంలో బరిలోకి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.