Allu Arjun Tweet: నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది.. చిరు ట్వీట్ కి బన్నీ ఇంటరెస్టింగ్ రిప్లై.. 'మెగా' కౌంటర్ వేశాడుగా!

Allu Arjun Counter to Megafans with Tweet: మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బన్నీ ఇచ్చిన రిప్లై కూడా చర్చనీయాంశం అయింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 29, 2023, 01:28 PM IST
Allu Arjun Tweet: నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది.. చిరు ట్వీట్ కి బన్నీ ఇంటరెస్టింగ్ రిప్లై.. 'మెగా' కౌంటర్ వేశాడుగా!

Allu Arjun Counter to Megafans: గత రెండు మూడు రోజులుగా ఒకటే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అదేమిటంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే అల్లు అర్జున్ ఆయనకు ఎందుకు విషెస్ చెప్పలేదు అని. బహుశా అల్లు అర్జున్ పర్సనల్ గా రాంచరణ్ కి మెసేజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఉండవచ్చు, లేదా ఫోన్ చేసి చెప్పి ఉండవచ్చు. కానీ సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డులు లభించిన సమయంలో కూడా రామ్ చరణ్ ఆ సినిమాలో భాగమయ్యాడని బన్నీ శుభాకాంక్షలు చెప్పలేదని చర్చ జరిగింది. ఒకరోజు గ్యాప్ తీసుకుని బన్నీ శుభాకాంక్షలు చెప్పడంతో ఆ చర్చ అక్కడితో సద్దుమణిగింది. ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ సోషల్ మీడియాలో విషెస్ చెప్పకపోవడంతో మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే రామ్ చరణ్ తేజ తన పుట్టినరోజు సందర్భంగా తన ఇంట్లో ఇచ్చిన పార్టీకి సైతం అల్లు అర్జున్ హాజరు కాకపోవడంతో ఈ విషయం మీద కూడా మెగా అభిమానులు మండిపడ్డారు.

అల్లు అర్జున్ చేస్తున్న పని కరెక్ట్ కాదు అంటూ విరుచుకుపడ్డారు. అయితే అల్లు అర్జున్ సినిమా గంగోత్రి నిన్నటికి విడుదలై 20 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా బన్నీ మీద అందరూ శుభాకాంక్షలు వెలువ కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం ఒక స్పెషల్ ట్వీట్ చేశారు. డియర్ బన్నీ అల్లు అర్జున్ 20 ఏళ్లు విజయవంతంగా నువ్వు సినిమాల్లో పూర్తి చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, నీ చిన్నప్పటి గుర్తులు నాకు ఇంకా ఫ్రెష్ గానే అనిపిస్తున్నాయి.

సమయం ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందో చూశావా? నిన్ను నువ్వే చెక్కుకొని పాన్ ఇండియా స్టార్ గా ఒక ఐకాన్ స్టార్ గా ఎదిగిన విధానం నాకు చాలా నచ్చింది, రాబోతున్న సంవత్సరాల్లో నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని ఇంకా ఎన్నో హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను అని చెబుతూ బన్నీ 100 డేస్ ఫంక్షన్ లోని ఫోటోని మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. అందులో అల్లు అర్జున్ చేతిని మెగాస్టార్ చిరంజీవి పట్టుకుని బన్నీకి నేనున్నానని అర్థం వచ్చేలా నవ్వుతూ కనిపిస్తున్నారు.

ఇక ఈ ట్వీట్ కూడా మరో సారి చర్చనీయాంశం అవుతుంది. దీనికి అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ మీ అద్భుతమైన దీవెనలకు శుభాకాంక్షలు మీ మీద నాకున్న గ్రాటిట్యూడ్ నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది ధన్యవాదాలు అంటూ కామెంట్ చేశాడు. ఈ విషయంతో ఒక్కసారిగా మెగా అభిమానుల నోర్లు అల్లు అర్జున్ మూయించాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏదైనా కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు అది మనసులో ఉంచుకుంటే చాలు దాన్ని నలుగురికి ప్రదర్శించాల్సిన అవసరం లేదని అర్థం వచ్చేలా అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చాడు అనే ప్రచారం జరుగుతోంది.

Also Read: Saif Ali Khan Son News: స్టార్ హీరో కుమారుడు గే.. సంచలనం రేపుతున్న ట్వీట్!

Also Read: Ram Charan Lineup: మెంటల్ ఎక్కిస్తున్న రామ్ చరణ్ మాస్ లైనప్.. ఎవరెవరితో సినిమాలు ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 
 

Trending News