Shukra Gochar 2023: ఏప్రిల్ 6న వృషభరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం

Malavya Rajyog: ఏప్రిల్ 6న శుక్రుడు రాశిని మార్చనున్నాడు. దీని వల్ల అరుదైన మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 12:47 PM IST
Shukra Gochar 2023: ఏప్రిల్ 6న వృషభరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం

Shukra Gochar Malavya Rajyog: ఐశ్వర్యంతోపాటు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. వృషభం మరియు తులారాశికి అధిపతి శుక్రుడు. వచ్చే నెల 06వ తేదీన శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా శుభకరమైన మాళవ్య రాజయోగం చేస్తున్నాడు. మీనరాశిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
మేషం
మేషరాశి యెుక్క 2వ మరియు 11వ ఇంటికి శుక్రుడు అధిపతి. దీంతో మీ సంపద రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కెరీర్ వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా సులభంగా తీసుకుటారు. 

కర్కాటకం
కర్కాటక రాశికి నాలుగవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి శుక్రుడు. దీంతో మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. ఫ్యామిలీలో సంతోషం నెలకొంటుంది. స్థిరచరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కెరీర్ పరంగా ఈ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. 

సింహం
ఈ రాశి యెుక్క 3వ మరియు 10వ ఇంటికి శుక్రుడు అధిపతి. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆఫీసులో మీకు సహచరుల సపోర్టు లభిస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారలుకు మరింత లాభం చేకూరుతుంది. 

Also Read: Durga Ashtami 2023: దుర్గాష్టమి నాడు గ్రహాల మహా సంయోగం.. ఈ రాశులపై కనక వర్షం.. 

Also Read: Anchor Anasuya Pics : బుల్లి నిక్కర్‌లో అనసూయ ఆసనాలు.. పిచ్చెక్కిస్తోన్న ఫోటోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News