Tamanna Bhatia, Rashmika Mandanna likely to perform in IPL Opening Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మరో వారం రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 31న క్రికెట్ పండుగ ఐపీఎల్ ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్ తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్ 2023 ఆరంభం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త అందింది. పాన్ ఇండియా హీరోయిన్స్ ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలలో మెరవనున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరగని విషయం తెలిసిందే. కరోనా పూర్తిగా తగ్గడం, ఈసారి స్వదేశంలోని మెహ టోర్నీ జరుగుతుండడంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈసారి సినీ గ్లామర్‌ను వాడుకోవాలని ఐపీఎల్ యాజమాన్యం చూస్తోంది. తెలుగు టాప్ హీరోయిన్స్ రష్మిక మంధన, తమన్నా భాటియాలు డాన్స్ ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరితో పాటు మరికొంత మంది మేల్, ఫిమేల్ ఆర్టిస్ట్‌లు ఆరంభ వేడుకల్లో పాల్గొంటారని సమాచారం తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలు మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌కు అరంగంట ముందు (రాత్రి 7:30 గంటలకు) ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. 'ఐపీఎల్ 2023 ఓపెనింగ్ వేడుక ఉంటుంది. అయితే వేడుక చిన్నదిగా ఉంటుంది. మూడేళ్ల తర్వాత హోమ్ అండ్ అవే ఫార్మాట్ తిరిగి అమల్లోకి వస్తుంది. స్వదేశీ ప్రేక్షకులను తిరిగి స్టేడియంలోకి స్వాగతించడం కోసం ఈ వేడుక చేస్తున్నాం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో అన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్‌కు కూడా ఓపెనింగ్ వేడుకను బీసీసీఐ నిర్వహించింది. కానీ సినీ సూపర్ స్టార్స్ లేకపోవడంతో.. ఆ వేడుక ఫ్లాప్ అయ్యింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ భారీ తారాగణంతో ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేసింది. Viacom18 ఐపీఎల్ 2023 డిజిటల్ హక్కులను గెలుచుకుంది. ఇక JioCinema ద్వారా స్ట్రీమింగ్ ఉచితంగా అందుబాటులో ఉంది. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ మరియు బెంగాలీతో సహా పలు భాషల్లో లైవ్ కవరేజ్ అందుబాటులో ఉంటుంది.
Also Read: Oppo Find N2 Flip: ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ క్రేజ్ మాములుగా లేదుగా.. నిమిషంలో స్టాక్ మొత్తం కలాస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.