Rahu Ketu Transit 2023 these 3 Zodiac Signs will be Affect: హిందూ పౌరాణిక గ్రంథాల ప్రకారం రాహు కేతువుల్ని అశుభ గ్రహాలుగా పిలుస్తారు. ఈ గ్రహాలు ఎప్పుడూ ప్రతికూల దిశలోనే సంచరిస్తుండటం వల్ల పాప గ్రహాలని కూడా అంటారు. ఈ గ్రహాల ప్రభావం వివిధ రాశులపై ఊహించని నష్టాన్ని కలగజేసేదిగా ఉంటుంది.
జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. కొన్ని రాశులపై ప్రతికూలంగా కొన్ని రాశులపై అనుకూలంగా ఉంటుంది. కానీ హిందూ పంచాంగంలో ఛాయా గ్రహాలుగా పిలిచే రాహుకేతువులు ఎప్పుడు రాశి మారినా ఆ ప్రభావం ఆయా రాశులపై తీవ్ర ప్రతికూలంగానే ఉంటుంది. రాహు కేతువులు ఎప్పుడు గోచారం చేసినా ఆ జాతకుల జీవితాల్ని అతలాకుతలం చేసేస్తుంది. ఈ గ్రహాల గోచారంతో చాలా రాశుల జీవితాలు నరకప్రాయంగా మారిపోతాయి. ఈసారి కూడా రాహు కేతువులు అక్టోబర్ 30వ తేదీన గోచారం చేయనున్నాయి. ఫలితంగా 4 రాశుల జీవితాలు సంకటంలో పడనున్నాయి.
రాహు కేతువుల ప్రభావం ఏ 3 రాశులపై..
వృషభ రాశి..
రాహు కేతువుల గోచారం కారణంగా ఈ రాశి జాతకులపై తీవ్ర ఇబ్బందులు పడనున్నాయి. రాహుకేతువు గోచారం కారణంగా ఇంట్లో అశాంతి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు వెంటాడుతాయి. ఆర్ధికంగా తీవ్ర సమస్యలు ఎదురౌతాయి. సోదర సోదరీమణుల మధ్య విభేదాలు ఉంటాయి. ఆఖరికి భార్యతో కూడా గొడవలు వస్తాయి. వైవాహిక, వృత్తి జీవితాలు రెండింట్లోనూ తీవ్ర అశాంతి నెలకొంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు జ్యోతిష్యంలో కొన్ని ఉపాయాలున్నాయంటున్నారు.
కన్యా రాశి..
కేతువు అక్టోబర్ 30వ తేదీన కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో ఈ రాశివారి జీవితం నరకప్రాయంగా మారనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది. చాలా పనుల్లో నష్టం వాటిల్లుతుంది. కుటుంబ సంబంధాలు చెడిపోతాయి. ఇచ్చిన రుణం తిరిగి రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతాయి. డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మేష రాశి..
రాహు కేతువుల రాశి పరివర్తనం ప్రభావంతో ఈ రాశి జాతకులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. పనిలో, వ్యాపారంలో నష్టాలు ఎదురౌతాయి. కుటుంబంలో ఏదో ఒక దుర్ఘటన ఎదురుకావచ్చు. పెట్టుబడులు నష్టపోతారు. ఇంటి గొడవలు మానసికంగా అశాంతిని కల్గిస్తాయి. ఊహించని ధననష్టం ఒకదాని వెంట మరొకటిగా వెంటాడటంతో కోలుకోవడం కష్టమౌతుంది.
Also Read: Guru Asta 2023: ఉగాది తర్వాత ఈ 2 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. కారణం ఇదే..!
Also Read: Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి మినహాయింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook