CM KCR Reacts On ED Notice to MLC Katitha: తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బీజేపీ ఓర్వలేకపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ చేతకాని తనం బయటపడుతుందనే అక్కసుతో అనేక కుట్రలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఇప్పటికే తమ పార్టీ మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని సీబీఐ, ఐటీ, ఈడీ దాడులతో తప్పుడు ఆరోపణలతో వేధిస్తోందన్నారు. బీజేపీ వేధింపులను ఎంతవరకైనా తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఈ దేశం నుంచి బీజేపీని పారద్రోలే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. 'విచారణ పేరుతో రేపు కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందట.. చేయనివ్వండి. ఏం చేస్తారో చూద్దాం. భయపడే ప్రసక్తి లేదు. అప్పుడు గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు నా బిడ్డ వరకు వచ్చారు. ఎంత మంచిగా పనిచేసినా బద్నాం చేసే వాళ్లు ఉంటారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది మన పార్టీ నేతలపై దాడులు పెరుగుతాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి..' అని ఆయన సూచించారు.
అదేవిధంగా ముందస్తు ఎన్నికలపై కూడా క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని.. ప్రతిపక్షాల ట్రాప్‌లో పార్టీ నాయకులు ఎవరు పడొద్దని సూచించారు.
నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించుకుని పాదయాత్ర చేసుకోవాలని చెప్పారు. మరో 9 నెలలపాటు కచ్చితంగా నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. సమయం తక్కువగా ఉందని.. కాలయాపన చేయకుండా కార్యచరణ రూపొందించుకుని ప్రతి ఓటరును కలవాలన్నారు.
'తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో దూసుకుపోతుంది. స్వయం పాలనను విఫలయత్నంగా చేయాలని ప్రారంభ దశలో సృష్టించిన అనేక అడ్డంకులను దాటుకొని మనం నిలబడ్డాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతిని చూసిన ఆ తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో ప్రజలు మనకు అండగా నిలబడ్డారు. విద్యుత్ కోతలు లేకుండా చేసుకున్నాం. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఇవాళ ప్రతీ ఇంటికి తాగునీరు నల్లాల ద్వారా అందుతోంది. సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తెలంగాణ చేరుకుంది. ఇంతటి అభివృద్ధి సాధించిన మన పార్టీ ఘన విజయాలను గుర్తు చేసుకుంటూనే.. మరింతగా ప్రజల్లోకి మన పార్టీని, మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
ఏప్రిల్ 14న బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ఈ సభకు అన్ని నియోజకవర్గాల నుంచి దళితబిడ్డలు పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఏప్రిల్ 25న పార్టీ జెండాల ఆవిష్కరణ అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభ నిర్వహిస్తాం. ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభోత్సవం ఉంటుంది. జూన్ 1 నాటికి అమరుల స్మారకార్థం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనులు పూర్తికావొస్తాయి. జూన్ 2న అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలి..' అని సీఎం కేసీఆర్ విస్తృత సమావేశాల్లో ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Vivek Murder Case: వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట
Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి