TTD Latest Updates : తిరుమలలో గత 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులను కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాల మధ్య సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు.
ఈ సందర్భంగా శ్రీదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. శ్రీవారు, అమ్మవారి దర్శనం కోసం మాడవీధులు, పుష్కరిణి ఘాట్ వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. సాధారణంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు మాత్రమే కాకుండా.. తెప్పోత్సవాలు జరిగే సమయంలో ఆ ఘట్టాలను వీక్షించి స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య కూడా కోకొల్లలుగా ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తిరుమలలో తెప్పోత్సవాలు జరుగుతున్న సందర్భంగా భక్తుల సందడి సాధారణ సమయాల్లో కంటే ఎక్కువగా కనిపించింది. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఘట్టంతో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ముగిశాయి అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదిలావుంటే, తిరుమలలో అన్యమత ప్రచారానికి తావు లేకుండా టిటిడి అధికారులు, విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. అడపాదడపా జరిగే చిన్న చిన్న ఘటనలే పెను వివాదాలకు తావిస్తున్న నేపథ్యంలో.. ఇకపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టిటిడి బోర్డు అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేసి చర్యలు తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : Laxmi Narsihma Swamy: లక్ష్మీ నరసింహ స్వామి వారికి పెళ్లిచూపులు
ఇది కూడా చదవండి : Holi 2023: 30 ఏళ్ల తర్వాత హోలీ రోజు అరుదైన సంఘటన.. ఈరాశుల వారు ధనవంతులు అవ్వడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook