Lakshmi Jayanti 2023: రేపు లక్ష్మీదేవి జయంతి.. ఈ తప్పులు చేశారో ఆర్థిక సంక్షోభం తప్పదు!

Lakshmi Jayanti 2023 Date, Tithi Time and Pooja For Money & Wealth. లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అపారమైన పుణ్యాలు లభిస్తాయి. 

Written by - P Sampath Kumar | Last Updated : Mar 6, 2023, 12:34 PM IST
  • రేపు లక్ష్మీదేవి జయంతి 2023
  • ఈ తప్పులు చేశారో ఆర్థిక సంక్షోభం తప్పదు
  • లక్ష్మీదేవితో పాటు విష్ణువు మరియు శంఖాన్ని కూడా
Lakshmi Jayanti 2023: రేపు లక్ష్మీదేవి జయంతి.. ఈ తప్పులు చేశారో ఆర్థిక సంక్షోభం తప్పదు!

Laxmi Jayanti 2023 Date and Time: హిందూ క్యాలెండర్ ప్రకారం.. హోలీ దహనం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. దీనితో పాటు లక్ష్మీదేవి జయంతిని కూడా అదే రోజున జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం... దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీర సముద్రాన్ని మథనం చేసినప్పుడు రత్నాలతో పాటు లక్ష్మీదేవి కూడా కనిపించింది. ఫాల్గుణ పూర్ణిమ రోజున సంపదలకు దేవతగా లక్ష్మీదేవిని పరిగణిస్తారు. లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అపారమైన పుణ్యాలు లభిస్తాయి. మరోవైపు ఈ రోజు చేసే తప్పులు లక్ష్మిదేవికి కోపం తెప్పిస్తాయి. ఈ సంవత్సరం లక్ష్మీ జయంతి (7 మార్చి 2023)ని ప్రజలు మంగళవారం జరుపుకుంటారు.

లక్ష్మీదేవి జయంతి 2023 తేదీ మరియు పూజ ముహూర్తం:
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఫాల్గుణ పూర్ణిమ తిథి మార్చి 6 సాయంత్రం 04:15 గంటలకు ప్రారంభమై, మార్చి 7 సాయంత్రం 06:10 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం లక్ష్మీ జయంతి ఉపవాసం మార్చి 7న మాత్రమే పాటించాలి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన అపారమైన సంపదలు చేకూరుతాయి. లక్ష్మీదేవితో పాటు విష్ణువు మరియు శంఖాన్ని కూడా పూజించండి. అప్పుడే మీకు పూర్తి ఫలితాలు లభిస్తాయి. విష్ణువు- లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. 

లక్ష్మీదేవి జయంతి నాడు చేయకూడని తప్పులు:
# లక్ష్మీదేవి జయంతి రోజున నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి.. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.

# పూజ సమయంలో మీకు ఇష్టమైన వస్తువులన్నింటినీ లక్ష్మీదేవికి సమర్పించండి. ప్రత్యేకంగా తామర పువ్వును సమర్పించండి. ఇలా చేయకుంటే పూజ చేసినా ఫలం లభించదు.

# లక్ష్మీదేవి పూజలో నలుపు రంగును ఉపయోగించవద్దు. అలాగే పూజ చేసే సమయంలో నల్లని దుస్తులు ధరించవద్దు.

# గుడ్లగూబపై స్వారీ చేస్తున్న లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఎప్పుడూ పూజించవద్దు. తామరపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్కరం.

Also Read: Mahindra Scorpio-N Price: టయోటా ఫార్చ్యూనర్‌కు బదులుగా.. జనాలు ఈ చౌకైన ఎస్‌యూవీని కొంటున్నారు! రూ 20 లక్షలు ఆదా

Also Read: Tata Safari EV 2023: టాటా సఫారి ఎలక్ట్రిక్ వెర్షన్ టెస్టింగ్ ప్రారంభం.. త్వరలోనే మార్కెట్‌లోకి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x