Amalaki Ekadashi 2023: అమలకీ ఏకాదశి రోజు ఈ వ్రతం చేస్తే ఇక మీకు తిరుగుండదు!

Amalaki Ekadashi 2023 Date:ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి అని పిలుస్తారు, ఈ అమలకి ఏకాదశి ఈ ఏడాది 2023 మార్చి 3, 2023 శుక్రవారం నాడు రాగా దాని విశిష్టత తెలుసుకుందాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 2, 2023, 01:45 PM IST
Amalaki Ekadashi 2023: అమలకీ ఏకాదశి రోజు ఈ వ్రతం చేస్తే ఇక మీకు తిరుగుండదు!

Amalaki Ekadashi Puja Vidhanam: ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి అని పిలుస్తారు. అమలకి ఏకాదశి ఈ ఏడాది 2023 మార్చి 3, 2023 శుక్రవారం నాడు వచ్చింది. అయితే ఈ ఏకాదశి వ్రతం మార్చి 4, 2023 ఉదయం 06:44 నుండి 09:03 వరకు జరుపుకునే అవకాశం ఉంటుంది. ఇక అమలకి ఏకాదశి వ్రతం ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ సహా బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఆచరిస్తారు, అక్కడి నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు సైతం నిర్వహిస్తూ ఉంటారు. 

అమలకి ఏకాదశి వ్రతం 2023 తేదీ మరియు శుభ ముహూర్తం 

అమలకి ఏకాదశి శుక్రవారం, మార్చి 3, 2023 తేదీన జరుపుకుంటారని తెలుసు కానీ ఈ ఏకాదశి 02వ తేదీ మార్చి 2023 ఉదయం 06:39 గంటలకు ప్రారంభమవుతుంది, ఆలాగే ఏకాదశి 03వ తేదీ మార్చి 2023 ఉదయం 09:11 గంటలకు ముగుస్తుంది. ఇక ఏకాదశి పారణం మార్చి 04, 2023 ఉదయం 06:44 నుండి 09:03 వరకు ఉంటుంది. 

అమలకి ఏకాదశి శీఘ్ర పూజా విధానం 
అమలకి ఏకాదశి రోజున భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని పూజిస్తారు, అలాగే ముందు రోజు ఉపవాసం పాటించి మరుసటి రోజు ఆరాధన ఉంటుంది. భక్తులు మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి పేదలకు  ఆహారం, బట్టలు సహా ఇతర నిత్యావసర వస్తువులను దానం చేస్తారు.

అలాగే భక్తులు ఉసిరి పండును విష్ణువుకు సమర్పిస్తారు. ఆలా చేయడం వలన ఆయన మంచి ఆరోగ్యం, సంపద సహా శ్రేయస్సు అందిస్తాడని పరిగణిస్తారు. అమలకి ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి భక్తులు దాని వెనుక ఉన్న కథను చదవవచ్చు లేదా వినవచ్చు.

అమలకీ ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత
అమలకి ఏకాదశి వ్రతం హిందువులలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అమలకి ఏకాదశి వ్రతం అంకితభావంతో పాటించే వారికి అదృష్టం, శ్రేయస్సు మరియు ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు. హిందూ గ్రంధాల ప్రకారం, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అన్ని పాపాలు తొలగిపోతాయి, మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున విష్ణు మూర్తికి ఉసిరి ఫలాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్ముతారు.

అమలకి ఏకాదశి వ్రతం రోజున విరాళం ఇవ్వడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అలా ఇచ్చిన దాతకు దీవెనలు, అదృష్టాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ ఉపవాసం సమస్యలను అధిగమించడానికి సహా ఒకరి జీవితంలో శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావడానికి కూడా సహాయపడుతుందని చెబుతారు.  అమలకీ ఏకాదశి వ్రతం హిందువులకు, ముఖ్యంగా విష్ణువు భక్తులకు పవిత్రమైన రోజు కాగా అదే రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి, విధివిధానాలను పాటించడం వల్ల భక్తులకు అనుగ్రహం, శుభాలు కలుగుతాయని నమ్మకం.

Also Read: Rahul Sipligunj Naatu Inspirational: పాతబస్తీ కుర్రోడు ఆస్కార్లో లైవ్ పెర్ఫార్మెన్స్.. ఇది కదా ఇన్స్పిరేషన్ అంటే!

Also Read: Jr NTR- Ram Charan Second Films: ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండో సినిమాలు జక్కన్నతోనే.. అందుకే ఈ రేంజ్ స్టార్ డం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News