ఇటీవలి కాలంలో స్థూలకాయం లేదా అధిక బరువు అనేది పెను సమస్యగా మారింది. స్థూలకాయం పరోక్షంగా డయాబెటిస్, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తోంది. అందుకే ఆహారపు అలవాట్లతో ఈ సమస్యకు చెక్ పెట్టాల్సి ఉంటుంది.
స్థూలకాయం తగ్గించేందుకు చాలామంది వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామం లేదా డైటింగ్ చేస్తుంటారు ఎన్ని చేసినా సరైన ఫలితాలు కన్పించవు. దీనికి కారణం తరచూ ఆకలి వేయడమే. ఎప్పుడైతే ఆకలేస్తుందో ఏదో ఒకటి తినడం అలవాటుగా మారి..స్థూలకాయం సమస్య తలెత్తుతుంది. అధిక బరువుకు చెక్ పెట్టడం అసాధ్యమౌతుంది. బరువు నియంత్రణలో ఉంటేనే వివిధ రకాల వ్యాధులు దూరమౌతాయి. అందుకే మనం తీసుకునే ఆహార పదార్ధాలు ఆకలిని కట్టడి చేసేవిగా ఉండాలి.
అధిక బరువుకు చెక్ చెప్పే పదార్ధాలు
ఓట్స్
ఓట్స్ తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. రోజూ ఓట్స్ తినడం వల్ల చాలా సేపటి వరకూ ఆకలనేది వేయదు. ఫలితంగా బరువు చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఓట్స్ అనేవి శరీరంలో సంతృప్తి హార్మోన్‌ను పెంచి కడుపు ఖాళీ చేసే ప్రక్రియను మందగింపజేస్తుంది. ఫలితంగా ఆకలి ఎక్కువగా ఉండదు. ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది.
బాదం
రోజూ ఉదయం నానబెట్టిన బాదం తినడం వల్ల ప్రీ వర్కవుట్ మీల్ లభించేసినట్టే. ఇవి తినడం వల్ల చాలా సేపటి వరకూ ఆకలేయదు. బాదం తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్ భారీగా లభిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మంంచిది. అందుకే రోజూ కాకపోయినా తరచూ తింటుంటే ఆరోగ్యం ఉంటుంది.
కాఫీ
కాఫీ అనేది సుదీర్ఘ సమయం వరకూడ ఎపటైట్ ప్రక్రియను నిలుపుతుంది. అందుకే కాఫీ మీ డైట్‌లో భాగం చేసుకోవాలి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండాలంటే రోజుకు 3-4 సార్లు కాఫీ తాగాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ మూడు పదార్ధాలను డైట్‌లో భాగంగా చేసుకుంటే కేవలం 40 రోజుల్లోనే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.
Also read: Benefits Of Green Grapes: ద్రాక్ష పండ్లతో ఈ తీవ్ర వ్యాధులు కూడా సులభంగా తగ్గుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook