Trigrahi yog 2023: కుంభరాశిలో అరుదైన యోగం.. ఈరాశులకు చెప్పలేనంత ధనం..

Trigrahi yog 2023: కుంభరాశిలో మూడు పెద్ద గ్రహాల కలయిక ఏర్పడింది. దీని కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం సృష్టించబడింది. ఈయోగం వల్ల కొన్ని రాశులవారు ఏదనుకుంటే అది జరుగుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2023, 04:19 PM IST
Trigrahi yog 2023: కుంభరాశిలో అరుదైన యోగం.. ఈరాశులకు చెప్పలేనంత ధనం..

Trigrahi yog 2023 Benefits: ఫిబ్రవరి 26న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అంతకముందే శనిదేవుడు, సూర్యభగవానుడు అదే రాశిలో కూర్చుని ఉన్నారు. ఈనేఫథ్యంలో నిన్న అంటే ఫిబ్రవరి 27న ఈ మూడు గ్రహాలు కలిసి కుంభరాశిలో త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరిచాయి. ఈయోగం వల్ల కొందరికి అదృష్టం పట్టనుంది. దీని వల్ల లాభపడనున్న రాశులేంటో ఓసారి తెలుసుకుందాం.

త్రిగ్రాహి యోగం ఈ రాశులకు వరం
మిథునం :
త్రిగ్రాహి యోగం వల్ల మిథునరాశి వారికి ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఫారిన్ కు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది.
వృషభం : కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల మీకు జాబ్ వస్తుంది. మీరు వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ బిజినెస్ లో వృద్ధి ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం: మూడు గ్రహాల కలయిక వల్ల మీరు ఏదైనా లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. అది కారైన లేదా ఇల్లైన కావచ్చు. మీ కెరీర్ మునుపటి కంటే అద్బుతంగా ఉండబోతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీ వ్యాపారం బాగుంటుంది. జాబ్ చేసేవారు కూడా లాభపడతారు. 

Also Read: Rajyog: రేర్ రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం... ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News