NZ Vs ENG: కళ్లు చెదిరే రనౌట్ చేసిన వికెట్ కీపర్.. వీడియో చూశారా..?

Michael Bracewel Run out Viral Video: ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫాక్స్  అద్భుతమైన రనౌట్ చేశాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ క్రీజ్‌లోకి వచ్చినా.. బ్యాట్, కాళ్లు నేలను తాకేలోపే వికెట్లను పడగొట్టాడు. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 05:31 PM IST
NZ Vs ENG: కళ్లు చెదిరే రనౌట్ చేసిన వికెట్ కీపర్.. వీడియో చూశారా..?

Michael Bracewel Run out Viral Video: న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 435 పరుగులకు డిక్లేర్ ఇవ్వగా.. బదులుగా కివీస్ జట్టు 209 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ ఆతిథ్య జట్టుకు ఫాలో ఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్.. ధీటుగా జవాబిచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‌కు 258 పరుగుల లక్ష్యాన్ని విధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు ఒక వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. 

ఇదిలా ఉంటే.. కివీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మైఖేల్ బ్రేస్‌వెల్‌ను వికెట్ కీపర్ బెన్ ఫాక్స్ రనౌట్ చేసిన విధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మైఖేల్ బ్రేస్‌వెల్ ఆఫ్ సైడ్ వైపు షాట్ ఆడగా.. రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. ఒక పరుగు పూర్తి చేసిన తర్వాత.. రెండో పరుగును కూడా సులభంగా పూర్తి చేస్తానని భావించాడు. ఇంతలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ కీపర్ బెన్ ఫాక్స్ వైపు బంతిని విసిరాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ ఆలస్యంగా చేయకుండా వెంటనే బెయిల్స్ పడగొట్టాడు. 

 

అప్పటికే మైఖేల్ బ్రేస్‌వెల్ క్రీజ్‌లోకి వచ్చాడు.. కానీ అయితే బ్యాట్ లేదా కాలు క్రీజును తాకలేదు. గాల్లో ఉన్న సమయంలోనే వికెట్ కీపర్ బెయిల్స్ పడగొట్టాడు. దీంతో నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ముగించేందుకు ఇంగ్లండ్ జట్టుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 5 వికెట్లు పడగొట్టాడు.

కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్‌లో తన 26వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేన్ అద్భుత పోరాటంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. ఈ సెంచరీతో టెస్ట్ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. రాస్ టేలర్ తన టెస్ట్ కెరీర్‌లో 7683 పరుగులు చేయగా.. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  కేన్ విలియమ్సన్ ఇప్పటివరకు బ్యాటింగ్‌తో 7787 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

Also Read: Prabhas Health : ప్రభాస్ అంతగా కష్టపడుతున్నాడా?.. అందుకే అనారోగ్యం పాలయ్యాడా?

Also Read: Tax Saving Tips 2023: ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా..? సింపుల్‌గా పన్ను ఆదా చేసుకోండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News