APPSC: కొత్త రూల్... ఇకపై గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలకు ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..

AP Govt: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై సీపీటీ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 03:50 PM IST
APPSC: కొత్త రూల్... ఇకపై గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలకు ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..

APPSC New rules: ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియమాక ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక గ్రూప్-2, గ్రూప్-3 జాబ్స్ భర్తీకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సాంకేతిక విద్యా మండలి, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండాగ్రూపు-2, గ్రూపు-3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేశారు. గతంలో ఈ ఉద్యోగాల భర్తీ డైరెక్ట్ గా జరిగేది. తాజా ఉత్తర్వులతో ఈ జాబ్స్ కు పోటీపడే వారంతా సీపీటీ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ సీపీటీ ఎగ్జామ్ (CPT Exam)ను 100 మార్కులకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుందని పోలా భాస్తర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంప్యూటర్లు, డిజిటల్‌ పరికరాలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్ విండోస్‌, ఇంటర్నెట్‌ తదితర అంశాల్లో పరీక్ష ను ఎదుర్కోవల్సి ఉంటుంది. గ్రూపు-1 జాబ్స్ కు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవంటూ ఉత్తర్వుల్లో క్లారిటీ ఇచ్చారు. త్వరలో సచివాలయాలు, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. 

Also Read: YS Jagan Nadu Nedu : ఏపీ విద్యా వ్యవస్థ.. 'నాడు నేడు'ని మెచ్చుకున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News