Here Is Surya Mahadasha Effects and Remedies: ప్రభుత్వ ఉద్యోగం, పెద్ద బ్యాంకు బ్యాలెన్స్, ఉన్నత పదవి, పలుకుబడి సాధించాలని ప్రతి ఒక్కరు నిత్యం కలలు కంటారు. సూర్యుని మహాదశ ఓ వ్యక్తి జీవిత కాలంలో సరైన సమయంలో కొనసాగితే.. వారి కలలన్నీ నిమిషాల్లో నెరవేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. విజయం, ఆత్మవిశ్వాసం, కీర్తి, ఆరోగ్యం, గౌరవం ఇచ్చే గ్రహంగా సూర్యుడిని పరిగణిస్తారు. సూర్యుని మహాదశ 6 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు జాతకంలో శుభ స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తికి పదవి, డబ్బు, పలుకుబడి, కీర్తి లభిస్తాయి. వారు ఏ రంగంలో ఉన్నా ఉన్నత శిఖరాలను అందుకుంటారు. వ్యాపారంలో ఉంటే.. భారీగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
సూర్యుని మహాదశ శుభ ప్రభావాలు:
ఒక వ్యక్తి జాతకంలో సూర్యుని స్థానం శుభప్రదంగా ఉంటే.. అతను సూర్యుని మహాదశ సమయంలో ఎన్నో శుభ ఫలితాలను పొందుతాడు. కెరీర్, పదవి, డబ్బుకు సంబంధించిన ప్రతి కల నెరవేరుతుంది. గతంలో నిలిచిపోయిన పని కూడా పూర్తి అవుతుంది. నాయకుడి పాత్రకు వెళతాడు. ప్రభుత్వ ఉద్యోగంలో, రాజకీయాలలో, పరిపాలనలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. సూర్యుని మహాదశ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు మంచి విజయాన్ని ఇస్తుంది.
సూర్యుని మహాదశ అశుభ ప్రభావాలు:
మరోవైపు ఓ వ్యక్తి జాతకంలో సూర్యుడు అశుభ స్థానంలో ఉంటే.. అతడు సూర్యుని మహాదశ సమయంలో తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ వ్యక్తికి తండ్రితో సంబంధాలు క్షీణిస్తాయి. అధిక రక్తపోటు మరియు కంటికి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది. కెరీర్, ఆర్ధికంగా బలహీన పడే అవకాశాలు ఉంటాయి. ఆ వ్యక్తి సూర్యుని మహాదశ కోసం నివారణలు తప్పక తీసుకోవాలి. ఆ నివారణలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సూర్యుని మహాదశ నివారణలు:
# రాగి పాత్రలో నీటిని తీసుకుని ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. రోలీ మరియు అక్షత్ ఆ నీటిలో కలపండి.
# రావి చెట్టుకు కూడా నిత్యం నీరు సమర్పించండి.
# ప్రతి ఆదివారం గోధుమలు, బెల్లం లేదా రాగిని దానం చేయండి.
# ఆదివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి.
# రోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
# నిత్యం 'ఓం రామ్ రవయే నమః' లేదా 'ఓం ఘృణి సూర్యాయ నమః' అనే మంత్రాన్ని జపించండి.
Also Read: Ben Stokes: నాకు ఐపీఎల్ ముఖ్యం కాదు.. బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు! చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.