Sapna Gill vs Prithvi shah: ఆ పార్ట్స్‌పై చేయి వేశాడు..పృధ్వీషాపై సప్నా గిల్ ఆరోపణలు

Sapna Gill vs Prithvi shah: టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీషా మరో వివాదంలో చిక్కుకున్నారు. అతడిపై మరో ఫిర్యాదు నమోదైంది. నటి సప్నా గిల్ పృధ్వీపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2023, 06:34 PM IST
Sapna Gill vs Prithvi shah: ఆ పార్ట్స్‌పై చేయి వేశాడు..పృధ్వీషాపై సప్నా గిల్ ఆరోపణలు

టీమ్ ఇండియా క్రికెటర్ పృధ్వీ షా వర్సెస్ భోజ్‌పురి నటి సప్నా గిల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సెల్ఫీ ఇష్యూతో ప్రారంభమైన వివాదం రోజూ పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా మరోసారి సప్నా గిల్..పృధ్వీ షాపై తీవ్ర ఆరోపణలు చేసింది. 

పృధ్వీ షా, సప్నాగిల్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. పృథ్వీ షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సప్నా గిల్ తో పాటు మరో ఏడుగురిపై ఒషివారా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సప్నా గిల్ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి తన స్నేహితులు పృథ్వీని కొట్టలేదని..సెల్ఫీ మాత్రమే అడిగారని సప్నా గిల్ చెప్పింది. సెల్ఫీ ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించడం వల్లనే గొడవ పెద్దదైందని తెలిపింది. 

తన స్నేహితుల్ని కొడుతుండే అడ్డుకున్నందుకు పృధ్వీ షా తన ప్రైవేట్ పార్ట్స్‌పై గట్టిగా చేతులు వేయడమే కాకుండా కొట్టాడని ఇప్పటికీ ఆ గాయాలు బాధిస్తున్నాయని సప్నా గిల్ ఓ టీవీ చర్చాగోష్టి కార్యక్రమంలో వాపోయింది. పృధ్వీ షా దాడి చేయడాన్ని వీడియో తీసేందుకు తన స్నేహితుడు ప్రయత్నించగా..పృధ్వీ షా బేస్ బాల్‌తో కొట్టాడని..బహిరంగ ప్రదేశంలో మారణాయుధాలతో దాడి చేసేందుకు ప్రయత్నించాడని సప్నా గిల్ ఆరోపించింది. 

Also read: MS Dhoni: ఎంఎస్ ధోనీ కెరీర్‌ చివరి దశకు చేరుకుంది.. సాయం చేయడానికి సిద్ధం: మ్యాథ్యూ హేడెన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News