Banana Side effects: అన్ని సీజన్లలో దొరికే ఒకే ఒక్క పండు అరటి. బనానాలో బోలెడన్నీ పోషకాలు ఉంటాయి. ఈ పండులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, పోటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎన్నో వ్యాధులను కూడా దూరం చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణమవ్వడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనిని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
అరటి పండు తినడం వల్ల నష్టాలు
** అరటి పండులో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ మీకు కిడ్నీకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దీనిని తినక పోవడమే మంచిది.
**బనానాలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది.దీనిని ఎక్కువగా పరిమాణంలో తీసుకోవడం వల్ల మీ నరాలు దెబ్బతినే అవకాశం ఉంది.
**అరటి పండు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే మధుమేహం ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే డాక్టర్ ను సంప్రదించి తీసుకోండి.
**బనానాను అధిక మెుత్తంలో తీసుకుంటే మీ పళ్లు పుచ్చిపోయే అవకాశం ఉంది. అయితే దీనిని తిన్న తర్వాత దంతాలను క్లీన్ చేసుకోవడం మంచిది.
**అరటి పండులో పైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని అతిగా తినడం వల్ల మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా దరిచేరుతాయి.
Also Read: Pear Side Effects: ఈ జబ్బులు ఉన్నవారు పొరపాటున కూడా ఈ పండు తినకండి.. తింటే అంతే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook