Millet Rice for Type 2 Diabetes: మన దేశంలో రోజు రోజుకు మధుమేహంతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు లైఫ్ స్టైల్, ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మధుమేహం రక్తంలో చక్కెర స్థాయిలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంత సులభంగా వాటిని నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ఆహారాల్లో వైట్ రైస్ తినడం మానేస్తున్నారు. అయితే ఇలా మానుకోవడం మంచిదేనా..? రైస్‌ను తినడం వల్ల కలిగే నష్టాల, ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైట్ రైస్ బదులు ఈ అన్నం తినండి:
ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నవారు విచ్చలవిడిగా వైట్ రైస్‌ను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్‌కు బదులుగా మిల్లెట్ రైస్ తీసుకుంటే శరీరానికి చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రక్తంలో చక్కెర పరిమాణాలు అదుపులో ఉంటాయి:
మిల్లెట్ రైస్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా.. శరీర బరువును, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ రైస్‌లో ఉండే గుణాలు టైప్-2 డయాబెటిస్ తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజూ మిల్లెట్ రైస్ తీసుకోవడం చాలా మంచిది.
మిల్లెట్ రైస్‌లో లభించే పోషకాలు:
మిల్లెట్ రైస్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఒక కప్పు వండిన మిల్లెట్ రైస్‌లో ఎలాంటి పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం.
కేలరీలు: 207
పిండి పదార్థాలు: 41 గ్రా
ఫైబర్: 2.2 గ్రా..
ప్రోటీన్: 6 గ్రా..
కొవ్వు: 1.7 గ్రా
భాస్వరం: 25%
మెగ్నీషియం: 19%
ఫోలేట్: 8%
ఐరన్: 6%
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Valentines week: వాలెంటైన్ డే కాదు..వాలెంటైన్ వీక్ ఇది, రేపటితో ఆఖరు
Also Read: Valentine History: వాలెంటైన్ డే చరిత్ర తెలియకే ఆందోళనలు, అసలు సంగతేంటంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook