LTTE Chief Prabhakaran Alive: ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. నెదుమారన్ సంచలన ప్రకటన

LTTE Chief Prabhakaran is Still alive? : ఎల్టీటీఈ ప్రభాకరన్ త్వరలోనే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేస్తారు. తమిళుల కోసం తను చేయబోయే పోరాటానికి సంబంధించిన ప్లాన్ ప్రకటిస్తారు. పార్టీలకు అతీతంగా తమిళనాడులో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు, తమిళులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు ప్రభాకరన్‌కి అండగా నిలవాలి అని నెదుమారన్ స్పష్టంచేశాడు.

Written by - Pavan | Last Updated : Feb 13, 2023, 05:44 PM IST
LTTE Chief Prabhakaran Alive: ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. నెదుమారన్ సంచలన ప్రకటన

LTTE Chief Prabhakaran is Still alive? : ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. ప్రభాకరన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. త్వరలోనే అందరి ముందుకు వస్తాడు. తమిళులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి, తమిళ సమాజం తరపున పోరాడటానికి వెలుపిల్లై ప్రభాకరన్ మళ్లీ వస్తాడు అంటూ తమిళ్ నేషనలిస్ట్ మూవ్ మెంట్ నాయకుడు పర నెదుమారన్ ప్రకటించారు. తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ నెదుమారన్ చేసిన ఈ సంచలన ప్రకటన కేవలం తమిళనాడులోనే కాదు.. భారత్, శ్రీలంక రెండు దేశాల్లోనూ సంచలనం సృష్టించేదే కావడం గమనార్హం.

నెదుమారన్ మీడియాతో మాట్లాడుతూ.. " ప్రస్తుతం అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, శ్రీలంకలో రాజకీయ సంక్షోభం, రాజపక్స ప్రభుత్వం అధికారంలో కోల్పోవడం వంటివి ప్రభాకరన్ బయటికొచ్చేలా చేస్తున్నాయి " అని అన్నారు. తమిళ వరల్డ్ ఫెడరేషన్‌కి తమిళ అధ్యక్షుడు కూడా అయిన నెదుమారన్.. ప్రభాకరన్ చనిపోయాడు అని జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైందని సంచలన ప్రకటన చేశారు. 

త్వరలోనే ప్రభాకరన్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేస్తారు. తమిళుల కోసం తను చేయబోయే పోరాటానికి సంబంధించిన ప్లాన్ ప్రకటిస్తారు. పార్టీలకు అతీతంగా తమిళనాడులో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు, తమిళులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు ప్రభాకరన్‌కి అండగా నిలవాలి అని నెదుమారన్ స్పష్టంచేశాడు. ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనే నిజం మీ అందరికి చెప్పడానికి తాను ఎంతో సంతోషిస్తున్నాను అని నెదుమారన్ పేర్కొన్నాడు. 

 

ఎల్టీటీఈ అంటే ఏంటి ?
ఎల్టీటీఈ.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం.. శ్రీలంకలో అక్కడి ప్రభుత్వం చేత, అక్కడి బడా బాబుల చేత వివక్ష ఎదుర్కొంటున్న తమిళుల హక్కుల కోసం వారి తరపున పోరాడేందుకు ఏర్పడిందే ఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. ఎల్టీటీఈని ముందుండి నడిపించిన నాయకుడే ఈ వేలుపిల్లై ప్రభాకరన్. శ్రీలంక ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారైన ఎల్టీటీఈని అసాంఘిక శక్తిగా ప్రకటించి నిషేధం విధించింది శ్రీలంక ప్రభుత్వం. నిషేధం విధించి సరిపెట్టుకోలేదు.. ప్రభాకరన్‌ని మట్టుపెట్టడానికి శ్రీలంక సైన్యాన్ని రంగంలోకి దింపి పెద్ద సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఎట్టకేలకు దశాబ్ధాల తరబడి కొనసాగిన వేట అనంతరం ప్రభాకరన్‌ని 2009లో మే 18న ముళ్లైవైక్కల్ జిల్లాలో ప్రభాకర్‌ని హతమార్చినట్టు శ్రీలంక సర్కారు అధికారికంగా ప్రకటన చేసింది.

ఇది కూడా చదవండి : 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఒకేసారి మూడు కీలక ప్రకటనలు..? 

ఇది కూడా చదవండి : Indian Army Recruitment 2023: ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్.. ఖాళీలు, అర్హత, చివరి తేదీ వివరాలు ఇవిగో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News