Ind Vs Aus 1st Test: జడ్డూ భాయ్ రీఎంట్రీ అదుర్స్.. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్

India Vs Australia 1st Test Day 1 Full Highlights: ఫస్ట టెస్ట్ మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం చేలాయించింది. మొదట బౌలింగ్‌లో ఆసీస్‌ను 177 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ రాణించింది. తొలి రోజు ఆట ముగిసి సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. రీఎంట్రీలో రవీంద్ర జడేజా సూపర్‌గా బౌలింగ్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 05:53 PM IST
  • ఐదు వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా
  • హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ
  • ముగిసిన తొలి రోజు ఆట; భారత్ స్కోర్: 77/1
Ind Vs Aus 1st Test: జడ్డూ భాయ్ రీఎంట్రీ అదుర్స్.. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్

India Vs Australia 1st Test Day 1 Full Highlights: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా మెరుగ్గా ఆరంభించింది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆసీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజులో భారత జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి 177 పరుగులకే కుప్పకూలింది. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా.. ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులు, అశ్విన్ (0) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. కేఎల్ రాహుల్ 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 100 పరుగుల ఆధిక్యంలో ఉంది. 
 
తొలి రోజు ఆటలో టీమిండియాగా పూర్తిగా డామినేట్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణయం తప్పని ఆదిలోనే అర్థమైపోయింది. రెండో ఓవర్‌లోనే ఉస్మాన్‌ ఖవాజా (1)ను సిరాజ్ ఔట్ చేయగా.. మూడో ఓవర్‌లో డేవిడ్ వార్నర్ (1)ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తరువాత లాబుషేన్, స్టీవ్ స్మిత్ కాసేపు కుదురుగా ఆడడంతో ఆసీస్ కోలుకున్నట్లే కనిపించింది. గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా.. రీఎంట్రీలో అదరగొట్టాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన లాబుషేన్ (49) ఔట్ చేసి.. 82 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాతి బంతికే మాట్ రెన్షా (0)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

కాసేపటికే స్టీవ్ స్మిత్ (37) కూడా జడేజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన అలెక్స్ కార్వే (36)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ కమ్మిన్స్ (6) కూడా అశ్విన్ బౌలింగ్‌లోనే ఔట్ అవ్వగా.. మర్ఫీ (0), హ్యాండ్స్‌కాంబ్ (31)ను జడేజా పెవిలియన్‌కు పంపించాడు. బోలాండ్ (1) రూపంలో ఆ జట్టు చివరి వికెట్ కోల్పోయింది. దీంతో 63.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్ అయింది. 

ఆసీస్ బ్యాట్స్‌మెన్ తడబడిన పిచ్‌పై టీమిండియా బ్యాట్స్‌మెన్ చక్కగా రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. 69 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (20) హిట్‌మ్యాన్‌కు సహకారం అందించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. రాహుల్ ఔట్ అయిన తరువాత నైట్‌ వాచ్‌మెన్‌గా అశ్విన్ క్రీజ్‌లోకి వచ్చాడు.

Also Read: TSRTC: పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సూపర్ డిస్కౌంట్  

Also Read: CM Jagan Mohan Reddy: తెలంగాణను మించి ఏపీలో జీఎస్టీ వసూళ్లు.. ఆ రాష్ట్రాల కంటే ఎక్కువే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News