Telangana Budget Updates: రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్.. భారీగా నిధులు కేటాయింపు

Telangana Budget 2023: ఎన్నో అంచనాల మధ్య తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. అంతముందు జూబ్లీహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బడ్జెట్ డాక్యుమెంట్లతో అసెంబ్లీకి చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు మంత్రి హరీష్‌రావు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2023, 12:59 PM IST
Telangana Budget Updates: రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్.. భారీగా నిధులు కేటాయింపు

Telangana Budget 2023: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ పద్దును రూపొందించారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్‌లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా రాష్ట్ర రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రుణమాఫీపై అసెంబ్లీ కీలక ప్రకటన చేసింది. ఈ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.6385 కోట్లు కేటాయిస్తున్నట్లు హరీష్‌రావు తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు కేటాయించగా.. రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు, రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో రైతులకు మంత్రి హరీష్‌రావు పెద్దపీట వేశారు. 

వైద్యారోగ్య శాఖ‌కు కూడా నిధులు భారీగా కేటాయించారు. ఈ బడ్జెట్‌లో రూ.12,161 కోట్లు కేటాయిస్తున్నట్లు హరీష్‌రావు తెలిపారు. అన్ని జిల్లాల‌కు కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్స్ విస్త‌రిస్తున్నట్లు ప్రకటించారు. రూ.200 కోట్లు కేటాయిస్తున్నామని.. 4 ల‌క్ష‌ల మంది గ‌ర్భిణుల‌కు ప్ర‌యోజ‌నం కలుగుతుందన్నారు. ప్ర‌తి ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీకి అనుబంధంగా న‌ర్సింగ్ కాలేజీలు, కొత్త‌గా మ‌రో 100 బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమానికి రూ.6229 కోట్లు కేటాయించారు. గతం కన్నా రూ.532 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. పౌరసరఫరాల శాఖకు రూ.3117 కోట్లు కేటాయించారు.  

గత ఎన్నికలకు ముందు లక్ష రూపాయలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు రూ.50 వేలలోపు రుణాలను మాపీ చేసింది కేసీఆర్ సర్కారు. రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులు.. రుణమాఫీ ఎప్పుడు అవుతుందోనని ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఈ బడ్జెట్‌లో గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రూ.లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు నిధులు కేటాయించింది. అదేవిధంగా రైతు బీమాకు నిధులు కేటాయించట్లేదనే విమర్శలకు కూడా చెక్ పెట్టింది. బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించింది. వ్యవసాయ రంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించడంపై అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 

Also Read: Pervez Musharraf: గంగూలీకి ముషారఫ్ ఫోన్.. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని వార్నింగ్

Also Read: Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్ ఎంతంటే..? శాఖల వారీగా కేటాయింపులు ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News