Weight Loss Green Tea: పాలు, పంచదార, టీ ఆకులతో చేసిన టీ కంటే గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందనడంలో సందేహం లేదు. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఈ హెర్బల్ టీని తాగడం ద్వారా బరువు తగ్గడానికి మరియు అనేక సమస్యలను దూరం చేయడానికి సిఫార్సు చేస్తారు, అయితే గ్రీన్ టీలో కొన్ని ప్రత్యేకమైన వాటిని జోడిస్తే, దాని లక్షణాలు చాలా పెరుగుతాయని మీకు తెలుసా. ఈ రోజు మనం గ్రీన్ టీతో కలిపి ఆరోగ్య ప్రయోజనాలను పొందగల 4 విషయాలను ప్రస్తావిస్తున్నాము.
వీటిని గ్రీన్ టీలో కలపడం వల్ల మేలు జరుగుతుంది
1. అల్లం:
భారతీయులు అల్లాన్ని మసాల వినియోగిస్తారు. ఇందులో ఉండే గుణాలు కూర రుచిని పెంచడమేకాకుండా శరీర రోగనిరోధక శక్తినని పెంచుతుంది. అయితే తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ గ్రీన్‌టీలో అల్లాన్ని కలిపి తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
2. పుదీనా ఆకులు, దాల్చినచెక్క:
బిర్యానిలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే గ్రీన్‌టీలో పుదీనా ఆకులు, దాల్చిన చెక్క వేసి ప్రతి రోజూ తాగితే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా శరీర బరువును కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఈ టీని తాగడం వల్ల బెల్లీ ప్యాట్‌తో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
3. నిమ్మకాయ:
గ్రీన్ టీలో నిమ్మకాయను కలిపి తీసుకుంటే రుచి కొద్దిగా చేదుగా ఉన్నప్పటికీ చాలా సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇలా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: AP New Medical Colleges: రాష్ట్రంలో 5 కొత్త వైద్య కళాశాలల్లో వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు
Also read: AP New Medical Colleges: రాష్ట్రంలో 5 కొత్త వైద్య కళాశాలల్లో వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook