ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఓ కేంద్ర ప్రభుత్వ పథకం. భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించే పథకమిది. అన్నదాతల కుటుంబ అవసరాలు తీర్చే పధకమిది.
అన్నదాతల ప్రయోజనం కోసం ప్రభుత్వం చాలా పథకాలు నడుపుతోంది. ఇందులో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సహాయం అందిస్తోంది. ఈ పథకం కింద లభించే డబ్బులు నేరుగా కుటుంబసభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. కొద్దిరోజుల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు అన్నదాతల ఎక్కౌంట్లలో జమ కానున్నాయి. 13వ విడత డబ్బులు మీకు లభించనున్నాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలో పరిశీలిద్దాం..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం భూమి కలిగిన రైతులందరికీ ఆర్ధిక సహాయం అందుతుంది. తద్వారా వ్యవసాయ సంబంధ, ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రకారం ఇప్పటి వరకూ 12 విడతల్లో ఆర్ధిక సహాయం అందింది. ఇప్పుడు త్వరలో 13వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
పీఎం కిసాన్ యోజన ప్రకారం భూమి కలిగిన రైతుల కుటుంబాలకు 6 వేల రూపాయలు ఏటా ఆర్ధిక సహాయం అందిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు 2 వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో లభిస్తుంది. ఈ పథకం ప్రకారం భూమి కలిగిన రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
పీఎం కిసాన్ వాయిదా
పీఎం కిసాన్ పథకం ప్రకారం 13వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో త్వరలోనే జమ కానున్నాయి. 13వ విడత ద్వారా పీఎం కిసాన్ నిధి పథకం ప్రయోజనార్దం జాబితాలో మీ పేరుందో లేదో కొన్ని టిప్స్ ద్వారా చెక్ చేసుకోండి.
మీ పేరుందో లేదో ఇలా చెక్ చేయండి
ముందుగా పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు హోమ్‌పేజ్‌లో Farmers Corner ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఫార్మర్స్ కార్నర్ మెనూలో లబ్దిదారుల జాబితా ఆప్షన్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ మెనూ నుంచి రాష్ట్రం, జిల్లా, తాలూకా, బ్లాక్, ఊరిని ఎంచుకోవాలి. చివరిగా గెట్ రిపోర్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook