Revanth Reddy: జీహెచ్ఎంసీలోకి కంటోన్మెంట్ బోర్డు.. రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

Revanth Reddy Question on Cantonment Board: దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు ఉన్నాయో.. అక్కడ పక్కనే ఉండే పట్టణాలతో పోల్చితే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు అభివృద్ధి విషయంలో వెనకబాటుకు గురవుతున్నట్టు గతంలో సుమితో బోస్ కమిటీ అధ్యయనంలో తేలింది అని అజయ్ భట్ గుర్తుచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 05:11 AM IST
Revanth Reddy: జీహెచ్ఎంసీలోకి కంటోన్మెంట్ బోర్డు.. రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

Revanth Reddy Question on Cantonment Board: సికింద్రాబాద్ కంట్మోనెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకు రావాలన్న ప్రతిపాదనపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు రక్షణ  శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. ఈ కమిటీలో మొత్తం 8 మంది సభ్యులు ఉంటారని అజయ్ భట్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనంపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ శుక్రవారం లోకసభలో మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం ఇస్తూ అజయ్ భట్ ఈ వివరాలు వెల్లడించారు. 

ఈ సందర్భంగా  మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ.. " సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంత ప్రజా ప్రతినిధులతోపాటు ఈ అంశంతో ముడిపడి ఉన్న వాళ్లు అందరిని సంప్రదించి అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనం అంశంపై కేంద్రం ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది " అని స్పష్టంచేశారు. 

దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు ఉన్నాయో.. అక్కడ పక్కనే ఉండే పట్టణాలతో పోల్చితే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు అభివృద్ధి విషయంలో వెనకబాటుకు గురవుతున్నట్టు గతంలో సుమితో బోస్ కమిటీ అధ్యయనంలో తేలింది అని అజయ్ భట్ గుర్తుచేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతోంది అని అన్నారు. అలాగే అమృత్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, స్మార్ట్ సిటీ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాల ద్వారా నిధులు కేటాయించి కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అజయ్ భట్ స్పష్టంచేశారు. 

కోర్టుల్లో పెండింగ్ కేసులపై మరో ప్రశ్నకు కేంద్రం సమాధానం

రేవంత్ రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. గత మూడేళ్లుగా సుప్రీం కోర్టు సహా దేశంలో వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిందని అన్నారు. 2022లో సుప్రీం కోర్టులో  69,768 కేసులు పెండింగ్‌లో ఉండగా తెలంగాణలో గతేడాది సెప్టెంబర్ 30 నాటికి హైకోర్టులో 2,36,549 కేసులు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 8,22,658 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేందుకు సుప్రీం కోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం పలు చర్యలు తీసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కిరణ్ రిజిజు సభకు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Secretariat Fire Accident: కొత్త సచివాలయం అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్.. కారణం అదేనా..?

ఇది కూడా చదవండి : Group-4 Exam Date: గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది... ఎప్పుడంటే..!

ఇది కూడా చదవండి : Ration Shops: రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News