SuryaKumar Yadav apologises to Washington Sundar over Run-Out in IND vs NZ 2nd T20I: ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ చివరి బంతి వరకు పోరాడి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు భారత బౌలర్ల ధాటికి కివీస్ 99 పరుగులే చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ డిసైడర్ మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లక్ష్య ఛేదనలో భారత్ పది ఓవర్లలో 51 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉండడం.. క్రీజులో రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్ ఉండడంతో విజయంపై అందరూ నమ్మకంగా ఉన్నారు. డ్రింక్స్ బ్రేక్ ముగిసిన తర్వాతి త్రిపాఠి పెవిలియన్‌కు చేరాడు. ఆ ఓవర్‌లో రెండే పరుగులే రావడంతో విజయ సమీకరణం 9 ఓవర్లలో 49 పరుగులుగా మారింది. ఈ సమయంలో సూర్యకుమార్‌తో కలిసి వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. దాంతో 6 ఓవర్లలో 30 పరుగులుగా విజయ సమీకరణం మారింది.
కీలక సమయంలో గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ రనౌత్ అయ్యాడు. 15వ ఓవర్ మూడో బంతిని సూర్యకుమార్ యాదవ్ షాట్ ఆడగా.. బాల్ పక్కనే పడింది. అయినా కూడా సూర్య పరుగు కోసం పరుగెత్తాడు. సుందర్ వద్దని చెబుతున్నా.. ఆగకుంగా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ వైపు దూసుకొచ్చాడు. దీంతో సూర్యకుమార్ వికెట్ విలువ తెల్సిన సుందర్ ముందుకు పరుగెత్తాడు. దాంతో రనౌట్ అయ్యాడు. తీవ్ర అసంతృప్తితో సుందర్ డగౌట్‌కు వెళ్లిపోయాడు. అయితే చివరివరకూ క్రీజ్‌లో ఉన్న సూర్యకుమార్ భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దాంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకొన్నాడు. సుందర్ రనౌట్ విషయంలో తనదే తప్పు అని సూర్య మ్యాచ్ అనంతరం అంగీకరించాడు.
— Guess Karo (@KuchNahiUkhada) January 30, 2023
'వాషింగ్టన్ సుందర్ రనౌట్ విషయంలో పూర్తిగా నాదే తప్పు. బంతి ఎక్కడికి వెళ్లిందనేది నేను ముందుగా గమనించలేదు. తర్వాత బంతి అక్కడే ఉందని తెలుసుకున్నా. కచ్చితంగా అక్కడ పరుగు రాదు. కఠినమైన పిచ్ మీద ప్రతి పరుగూ చేయడం కష్టంగా మారింది. చివరి వరకూ బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించడం ఆనందంగా ఉంది' అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. సుందర్‌ను రనౌట్ చేయడంపై సూర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తప్పును ఒప్పుకున్న సూర్యను ఫాన్స్, నెటిజన్లు ప్రశంసించారు.
Also Read: Shubman Gill: శుబ్‌మన్ గిల్ టీ20లకు పనికిరాడు.. అతడిని తుది జట్టులో తీసుకురండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.