Ajith Kumar's film with Vignesh Shivan on hold: తునివు విజయంతో ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్టుగా దూసుకుపోతున్న అజిత్ కుమార్ అభిమానులు తమ హీరో నెక్స్ట్ మూవీ ప్లాన్‌లో మార్పు ఉందనే వార్తలు సోషల్ మీడియా వెల్లువెత్తడంతో అయోమయంలో పడ్డారు. నిజానికి అజిత్ తదుపరి ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా AK 62 పేరుతో పిలుస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉన్న ఈ సినిమాకు సంబంధించి గతేడాది అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసి దీనికి సంగీతం సమకూర్చడానికి అనిరుధ్‌ను కూడా తీసుకున్నారు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. విఘ్నేష్ స్థానంలో మరొక దర్శకుడిని లైన్ లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి ముందుగా ఈ సినిమాకు అట్లీ లేదా విష్ణువర్ధన్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది కానీ తాజా అప్డేట్ ఏమిటంటే, మగిజ్ తిరుమేని ఈ సినిమా దర్శకుడిగా ఎంపిక కాబడ్డాడని అంటున్నారు.
గతంలో అనేక సినిమాలతో ఆకట్టుకున్న తిరుమేని చివరిసారిగా ఉదయనిధితో కలగ తలైవన్ చిత్రాన్ని రూపొందించారు. త్వరలోనే అఫీషియల్ అప్డేట్ ఈ సినిమాకు సంబంధించి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక నటీనటులు, సంగీత దర్శకులు కూడా మారతారని వారి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తిరుమేని డైరెక్షన్లో తెరకేక్కే సినిమాను మరో ఒకటి రెండు నెలల్లో సెట్స్ మీదకు తీసుకువెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.
అలాగే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అజిత్ ఆ తరువాతి సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. దీనికి తాత్కాలికంగా AK 63 అని పేరు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక విఘ్నేష్ తెరకెక్కించే సినిమా కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. అయితే అజిత్ మాత్రం ఒక యాక్షన్-ప్యాక్డ్ కథ కోసం వెతుకుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌కే ప్రాధాన్యత ఇస్తారో లేదో చూడాలి మరి.
Also Read: Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook