How To Make Tamarind Face Mask: చింతపండు రుచిలో పుల్లని తీపిగా ఉన్నప్పటికీ ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అయితే ఇది వంటకాల రుచిని పెంచడమేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. చింత పండును ఫేస్ ఫ్యాక్ లాగా తయారు చేసుకుని స్కినకు అప్లై చేయడం చాలా వల్ల చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా స్కిన్ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే ఈ ఫేస్ ఫ్యాన్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు ఫేస్ ప్యాక్‌ను ఫేస్‌కి వినియోగించడం వల్ల ముడతలు, ఫైన్-లైన్లు, మచ్చలు వంటి సమస్యలను తొలగించవచ్చు. చింతపండులో హైడ్రాక్సీ యాసిడ్, విటమిన్ సి వంటి చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి డెడ్ స్కిన్ తొలగించికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ముఖాన్ని మెరుగుపర్చడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
చింతపండు ఫేస్ ప్యాక్ తయారీకి అవసరమైన పదార్థాలు:
2 టీ స్పూన్ చింతపండు గుజ్జు
1 టీ స్పూన్ ముల్తానీ మిట్టి
1 టీ స్పూన్ అలోవెరా జెల్
చింతపండు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి?
ఫేస్ ప్యాక్ చేయడానికి.. ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకోండి.
తర్వాత 2 నుంచి 3 చెంచాల నీటిలో చింతపండు గుజ్జు వేసి కరిగించుకోవాలి.
తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసి చిన్న గిన్నెలో పోసుకోవాలి.
ఈ నీళ్లలో ముల్తానీ మిట్టి, అలోవెరా జెల్ వేయాలి.
అన్నింటినీ వేసి బాగా మిశ్రమంగా మిక్స్ చేసుకోవాలి.
చింతపండు ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలి?
చింతపండు ఫేస్ ప్యాక్ వినియోగించడానికి ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
తర్వాత మీ ముఖాన్ని తుడిచి, చింతపండు ఫేస్ ప్యాక్‌ను బాగా అప్లై చేయండి.
ఆ తర్వాత ముఖానికి సుమారు 10 నుంచి 15 నిమిషాలు అప్లై చేసి అలానే ఉంచండి.
తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్
Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి