King Cobra Caught: బాప్రే.. 18 అడుగుల డేంజరస్ కింగ్ కోబ్రాను స్నేక్ స్నాచర్ ఎలా పట్టాడో చూడండి

Snake Catcher Caught Big King Cobra: ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలోని ఓ ఇంట్లో 18 అడుగుల భారీ కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్‌ సర్పమిత్ర ఆకాష్ జాదవ్ పట్టుకున్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 28, 2023, 12:20 PM IST
  • బుసలు కొడుతున్న 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా..
  • ఈ వ్యక్తి ఎంత సులువుగా పట్టాడో చూడండి
  • ఇప్పటివరకు 6,270,190 వ్యూస్
King Cobra Caught: బాప్రే.. 18 అడుగుల డేంజరస్ కింగ్ కోబ్రాను స్నేక్ స్నాచర్ ఎలా పట్టాడో చూడండి

Brave Snake Catcher Caught 18 feet King Cobra in a Home: ఈ భూ ప్రపంచం మీద అత్యంత విషపూరితమైన పాములలో 'కింగ్ కోబ్రా' ఒకటి. కింగ్ కోబ్రా పాములన్నింటిలో కెల్లా అత్యంత పొడవైనది. ఎక్కువగా ఆగ్నేయ ఆసియాలో సంచరించే కింగ్ కోబ్రా.. భారత దేశంలో కూడా పలు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. కింగ్ కోబ్రా కాటు వేస్తే.. మనిషి ప్రాణాలు 10-15 నిమిషాల్లో గాల్లో కలిసిపోతాయి. కింగ్ కోబ్రా కాటుకు భారీ ఏనుగు కూడా నిమిషాల వ్యవధిలో చనిపోతుంది. సాధారణ పాము లానే కింగ్ కోబ్రా విషం ఉన్నా.. అది కాటేసే సమయంలో ఎక్కువ విషం చిమ్ముతుంది. అందుకే కింగ్ కోబ్రా అంటే అందరూ హడలిపోతారు. అంతేకాకుండా మరికొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

కింగ్ కోబ్రాను సాధారణ మనిషి పట్టుకోవడం అటుంచితే.. చంపడం కూడా అసాధ్యమే. సీనియర్ స్నేక్ క్యాచర్‌లు మాత్రమే కింగ్ కోబ్రాను పట్టుకుంటారు. కొన్నిసార్లు స్నేక్ క్యాచర్‌లకు కూడా అవి చుక్కలు చూపిస్తాయి. అంతరించిపోతున్న పాములను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు స్నేక్ క్యాచర్‌లు ఎంత కష్టమైనా పట్టుకుంటారు. 18 అడుగుల భారీ కింగ్ కోబ్రాను కూడా వీరు పట్టుకుని బంధిస్తారు. బుసలు కొట్టినా సరే తమ చాకచక్యంతో పట్టుకుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలోని ఓ ఇంట్లో 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా ఉంటుంది. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్‌ సర్పమిత్ర ఆకాష్ జాదవ్ అక్కడికి చేరుకుంటాడు. ఇంట్లోని చూరులో పాము ఉండగా.. దాని తోకను పట్టుకుని నెమ్మదిగా బయటికి తీస్తాడు. కిందకు వచ్చిన కింగ్ కోబ్రా.. బుసలు కొడుతున్నా అస్సలు బెదరకుండా స్టిక్ సాయంతో ఇంటి బయటికి తీసుకొస్తాడు. ఆపై స్టిక్ సాయంతో.. సంచిలో బంధిస్తాడు. అనంతరం ఆ కింగ్ కోబ్రాను అడవి ప్రాంతంలో వదిలేయడంతో.. ఆ పాము అడవిలోని చెట్లలోకి వెళ్లిపోయింది.

స్నేక్ క్యాచర్‌ సర్పమిత్ర ఆకాష్ జాదవ్ పట్టిన భారీ కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. ఈ వీడియోని Sarpmitra Akash Jadhav అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఈ వీడియో మూడు నెలల క్రితందే అయినా.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతొంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 6,270,190 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

Also Read: ICC ODI Team 2022: ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు.. భారత్ నుంచి ఇద్దరికే చోటు! కెప్టెన్‌గా బాబర్‌ ఆజామ్  

Also Read: Rohit Sharma Century: వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీ.. మూడేళ్ల నిరీక్షణకు తెర! పాంటింగ్‌తో కలిసి సమంగా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook

Trending News