Itel A24 Pro: 5 వేల లోపే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోద్ది! గుడ్ లుకింగ్

Itel Release Budget Smartphone Under Rs.5000:  ఐటెల్ కంపెనీ కొత్త బడ్జెట్ ఫోన్‌ని ప్రకటించింది. ఆ స్మార్ట్‌ఫోన్‌ పేరు 'ఐటెల్ ఏ24 ప్రో'.

Written by - P Sampath Kumar | Last Updated : Jan 24, 2023, 11:17 AM IST
  • 5 వేల లోపే సూపర్ స్మార్ట్‌ఫోన్‌
  • ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోద్ది
  • గుడ్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌
Itel A24 Pro: 5 వేల లోపే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోద్ది! గుడ్ లుకింగ్

Budget Smartphone under Rs 5000: ఐటెల్ (Itel) ఎల్లప్పుడూ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోదారులకు అందిస్తుంది. ఈ క్రమంలోనే కంపెనీ కొత్త బడ్జెట్ ఫోన్‌ని ప్రకటించింది. ఆ స్మార్ట్‌ఫోన్‌ పేరు 'ఐటెల్ ఏ24 ప్రో' (Itel A24 Pro). ఇది కాంపాక్ట్ ఫోన్. ఈ  స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే చాలా చిన్నదిగా ఉంటుంది. కెమెరా ఫోన్ వెనుక భాగంలో అందుబాటులో ఉంది. ఐటెల్ ఏ24 ప్రో ఫోన్ 4G కనెక్టివిటీతో వస్తుంది. ఫోన్ ధర కూడా చాలా తక్కువగా ఉంది. ఐటెల్ ఏ24 ప్రో ధర మరియు ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం.

Itel A24 Pro Specifications:
ఐటెల్ ఏ24 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 850 x 480 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ లేదు. అయితే ఈ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 గో వెర్షన్‌లో రన్ అవుతుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 2MP కెమెరా ఉంటుంది. ముందువైపు 0.3MP సెన్సార్ ఉంది. ఈ ఫోన్ డిజైన్ చాలా ట్రెండీగా ఉంది.

Itel A24 Pro Battery:
ఐటెల్ ఏ24 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 3020mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను Micro SB పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్ Unisoc SC9832E క్వాడ్-కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ర్యామ్ ఎంత ఉంటుందో సమాచారం లేదు. అయితే ఫోన్ 32GB స్టోరేజ్‌తో వస్తుంది.

Itel A24 Pro Price:
ఐటెల్ ఏ24 ప్రో స్మార్ట్‌ఫోన్‌ బంగ్లాదేశ్‌లో ప్రారంభించబడింది. అక్కడ దీని ధర $57 (భారత కరెన్సీలో రూ. 4,632). ఈ ఫోన్ గ్రీన్ కలర్‌లో మాత్రమే వస్తుంది. 

Also Read: హ్యుందాయ్ క్రెటాకు పోటీగా.. టాటా, మహీంద్రాల కొత్త ఎస్‌యూవీలు! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500కిమీ  

Also Read: Vaarasudu Collections: దిల్ రాజుకు షాక్.. వారసుడు బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News