Shani Dev Transit In Kumbh 2023: కర్మను ఇచ్చే శనిదేవుడు కుంభరాశిలో సంచరించాడు. అంటే శనిదేవుడు రెండున్నర సంవత్సరాలపాటు కుంభంరాశిలో గోచరిస్తాడని అర్థం. శని కటాక్షం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. ప్రస్తుతం కుంభరాశిలో శనిదేవుడు వెండి పాదాలపై నడుస్తున్నాడు. దీని కారణంగా మీరు అపారమైన డబ్బు మరియ కెరీర్ లో ఉన్నతమైన పురోగతిని సాధిస్తారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
మకర రాశిచక్రం
శనిదేవుడి సంచారం వల్ల వీరు ఊహించని ధనలాభం పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శనిదేవుడు ఈరాశిచక్రం యెుక్క రెండో ఇంట్లో సంచరిస్తున్నాడు. పైగా ఈ రాశి శనిదేవుడి సొంత ఇల్లు. దీని కారణంగా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు నీలమణిని ధరించడం వల్ల ప్రయోజనం పొందుతారు.
తులా రాశిచక్రం
జనవరి 17 నుండి మీపై శని శని ప్రభావం తొలగిపోయింది. అదేవిధంగా శనిదేవుడు మీ రాశి నుండి వెండి పీఠంపై సంచరించాడు. వైద్యులు, ఇంజనీరింగ్ మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. పెద్ద స్థానాల్లో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ, వైవాహిక జీవితంలో కొంత టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే రాహుదేవుడు మీ రాశి నుండి ఏడవ ఇంటిలో ఉన్నాడు. ఈ సమయంలో మీరు రాహు మంత్రాలను జపించడం మీకు మేలు చేస్తుంది.
మిథున రాశిచక్రం
శనిదేవుడు మీ రాశి నుండి వెండి పీఠంపై సంచరించాడు. దీంతోపాటు మీ జాతకంలో అదృష్ట స్థానంలో శనిదేవుడు ఉన్నాడు. ఆఫీసులో మీకు పని కొంత ఎక్కువగా ఉండవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పదవి దక్కే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కేతు గ్రహం యెుక్క బీజమంత్రాలను జపించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: Rajyog: కుంభరాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశులకు చెప్పలేనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
కుంభరాశిలో వెండిపాదాలపై నడుస్తున్న శనిదేవుడు.. ఈ రాశులకు తిరుగులేనంత ధనం..