Wipro Fires 400 Employees: ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలలో వరుసగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ తరువాత మరో కంపెనీ విప్రో 400 మంది ఉద్యోగులను తొలగించింది. ఇంటర్నల్ టెస్ట్ ఆధారంగా వీరందరిని తొలగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సంబంధిత ఉద్యోగులకు టెర్మినేషన్ లెటర్లను మెయిల్ చేసింది. ఈ ఉద్యోగులకు సరైన శిక్షణ ఇచ్చినా.. వృత్తిపరంగా మంచి ప్రదర్శన చేయడంలో విఫలమైనట్లు కంపెనీ చెబుతోంది.
శిక్షణ కోసం రూ.75 వేలు చెల్లించాల్సి ఉంటుందని ముందుగా ఒప్పందంగా కుదుర్చుకున్నా.. తాజాగా ఆ డబ్బు చెల్లించాల్సిన పనిలేదని చెప్పింది. "మీరు చెల్లించాల్సిన శిక్షణ ఖర్చు రూ.75 వేలు మాఫీ చేస్తున్నాం. మీరు ఎక్కడ పనిచేసినా.. కేటాయించిన రంగంలో మంచిగా రాణించాలని మేం కోరుకుంటున్నాం.." అంటూ విప్రో కంపెనీ లెటర్లో పేర్కొంది.
ఇక మూడు రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ కూడా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆల్ఫాబెట్‌లోని రిక్రూట్మెంట్ విభాగం, కార్పొరేట్ ఫంక్షన్‌తో పాటు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డిపార్ట్మెంట్ టీమ్‌తో సహా అన్ని టీమ్‌లలో ఉద్యోగుల తొలగింపు ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ తొలగింపు జరుగుతోందని.. దీని ప్రభావం అమెరికాలో వెంటనే కనిపిస్తుందని గూగుల్ తెలిపింది. ఆర్థిక అనిశ్చితే గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
మరోవైపు సాంకేతికత స్థాయిలో కంపెనీలు భారీ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్న సమయంలో ఇలా ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌లో పెట్టుబడి పెడుతున్నాయి. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. అమెరికా ముందు చాలా పెద్ద అవకాశాలు ఉన్నాయని తాను నమ్ముతున్నాని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో తమ పెట్టుబడులు పెరగబోతున్నాయన్నారు.
తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 12 వేల మందిని తగ్గించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు సుందర్ పిచాయ్. ఇప్పటికే సంబంధిత ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. కష్టపడి పనిచేసిన, పని చేయడానికి ఇష్టపడే అద్భుతమైన ప్రతిభావంతులను తాము కోల్పోతున్నామని.. అందుకు తాను ప్రగాఢంగా చింతిస్తున్నానని అన్నారు. ఈ మార్పులు గూగ్లర్ల జీవితాలపై ప్రభావం చూపుతాయనే వాస్తవం తనకు భారంగా ఉందన్నారు. గత రెండేళ్లలో తాము ఎంతో వృద్ధిని చూశామన్నారు. వరుసగా దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింనులు కొనసాగుతుండడంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
Also Read: IND VS NZ: నేడే రెండో వన్డే.. కోహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు
Also Read: Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి