వాములో ఔషధ గుణాలు అత్యధికంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యపరంగా చాలా లాభదాయకమైంది. రోజూ పరగడుపున క్రమం తప్పకుండా తీసుకుంటే అద్భుతమైన లాభాలున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వాములో మినరల్స్, ఫైబర్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, థయామిన్, రిబోఫ్లెవిన్, నియాసిన్ వంటి పోషకాలున్నాయి. వాముతో చేసే హెర్బల్ టీ మరింత లాభదాయకం. రోజూ ఉదయం సమయంలో పరగడుపున వాముతో చేసే హెర్బల్ టీ తాగితే అనేక వ్యాధుల్ని దూరంం చేయవచ్చు. వాము హర్బల్ టీతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలేంటో చూద్దాం..
ఎలా చేయాలి
వాము హెర్బల్ టీ తయారు చేసేందుకు నీళ్లలో టీపొడికి బదులు వాము వేసి బాగా ఉడికించాలి. ఆ నీళ్లు సగమయ్యాక..వడపోసి కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి.
జీర్ణక్రియకు లాభం
వాము జీర్ణానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాము టీ తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన చాలా సమస్యలు దూరమౌతాయి. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. కడుపులో నొప్పి దూరం చేస్తుంది.
అధిక బరువుకు చెక్
వాము మెటబోలిజంను పెంచడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉదయం పరగడుపున వాముతో హెర్బల్ టీ తాగడం వల్ల బరువు అద్భుతంగా తగ్గుతుంది. వాములో ఉండే పోషకాలతో కేలరీలు వేగంగా కరుగుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.
ఇమ్యూనిటీ పటిష్టం
వాములో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాము టీ ఇమ్యూనిటీని పెంచేందుకు దోహదపడుతుంది. వాము టీ తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమౌతాయి.
కీళ్ల నొప్పులు దూరం
వాములో ఉండే పోషక పదార్ధాలు ఎముకలకు బలాన్నిస్తాయి. వాము టీ లేదా డ్రింక్ తాగడం వల్ల ఎముకలకు పటిష్టత వస్తుంది. కీల్ల నొప్పులు లేదా ఎముకల్లో నొప్పులు దూరమౌతాయి.
ఒత్తిడి దూరం
వాములో ఉండే పోషకాలతో ఒత్తిడి దూరమౌతుంది. వాము హెర్బల్ టీ నిద్రలేమిని దూరం చేస్తుంది. ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు అద్భుత పరిష్కారం వాము. వాముతో చేసే హెర్బల్ టీ తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది.
Also read: Dryness Reasons: ఉన్నట్టుండి నోరెండిపోతుందా, ఈ ప్రమాదకర వ్యాధులు కావచ్చు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook