Virat Kohli breaks 9 records in India vs Sri Lanka 3rd ODI: శ్రీలంకతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 317 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (166), శుభ్‌మాన్ గిల్ (116) సెంచరీలతో చెలరేగారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు (6 వికెట్స్) 73 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం.
రికార్డులు ఇవే:
# వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా (317) భారత్ భారీ విజయం అందుకుంది. న్యూజిలాండ్ (ఐర్లాండ్‌పై 290) పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది.
# విరాట్ కోహ్లీ సెంచరీ బాదడంతో స్వదేశంలో అత్యధిక శతకాలు (21) బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదివరకు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (20) పేరిట ఉంది.
# వన్డేల్లో శ్రీలంకపై విరాట్ కోహ్లీ 10వ సెంచరీ బాదాడు. వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సచిన్ టెండూల్కర్ (వెస్టిండీస్‌పై 9) రెండో స్థానంలో ఉన్నాడు.
# వన్డేల్లో విరాట్ కోహ్లీకిది రెండో అత్యధిక స్కోరు. 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 183 పరుగులు చేశాడు.
# వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (12,574) ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ శతకం చేయడం ద్వారా లంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (12650)ను అధిగమించాడు.
# వన్డే ఫార్మాట్‌లో వేగంగా (106 బంతుల్లో) 150 రన్స్ చేసిన రెండో భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇషాన్ కిషన్ (103 బంతుల్లో బంగ్లాదేశ్‌పై) తొలి స్థానంలో ఉన్నాడు.
# మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 8 సిక్స్‌లు బాదాడు. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో కోహ్లీ అత్యధిక సిక్స్‌లు ఇవే.
# వన్డేల్లో శ్రీలంకకు ఇది (73) నాలుగో అత్యల్ప స్కోరు.
# వన్డే ఫార్మాట్లో శ్రీలంకపై భారత్‌కు నాలుగో (390/5) అత్యధిక స్కోరు ఇది.
# వన్డే ఫార్మాట్లో శ్రీలంకపై అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన జాబితాలో ఎంఎస్ ధోనీతో కలిసి విరాట్ కోహ్లీ (21) రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ (25) ఉన్నాడు.
# అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు అందుకున్న మూడో ఆటగాడిగా విరాట్ కోహ్లీ(10) నిలిచాడు. మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ (15) ఉండగా.. రెండో స్థానంలో సనత్ జయసూర్య (11) ఉన్నాడు.
# వన్డేల్లో 150కి పైగా స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండ్యూలర్, క్రిస్ గేల్‌తో కలిసి విరాట్ కోహ్లీ(5) మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ (8), డేవిడ్ వార్నర్ (6) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
# మొహ్మద్ సిరాజ్ (4/32) వన్డేల్లో తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.
Also Read: Best Electric Scooters: ఓలాకు పోటీగా ఆంపియర్.. 85 వేల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు!
Also Read: Delhi Cold Weather: పడిపోతున్న ఢిల్లీ ఉష్ణోగ్రతలు.. నేటి నుంచి మరో 'కోల్డ్ స్పెల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
IND vs SL: మూడో వన్డేలో భారత్ విజయం.. 9 రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ! నమోదయిన రికార్డులు ఇవే
మూడో వన్డేలో భారత్ రికార్డు విజయం
నమోదయిన రికార్డులు ఇవే
9 రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ