కేంద్ర బడ్జెట్‌కు ముందే కొన్ని రకాల వస్తువులపై ట్యాక్స్ తప్పదని తేలిపోయింది. ఫలితంగా 35 వస్తువుల ధరలు పెరగనున్నాయి. దేశీయంగా ఈ వస్తువుల తయారీ జరిగేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఫిబ్రవరి 1వ తేదీ 2023న కేంద్ర బడ్జెట్ ఉంది. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో చాలా వస్తువుల్లో మార్పులు రానున్నాయి. కొన్ని సామాన్లపై ఇంపోర్ట్ ట్యాక్స్ పెరిగితే కొన్నింటిపై తగ్గింపు చోటుచేసుకుంది. ఈసారి కనీసం 35 రకాల వస్తువులపై ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచనున్నారని తెలుస్తోంది.
ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచనున్న వస్తువుల్లో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, జువెల్లరీ, హై గ్లాస్ పేపర్, విటమిన్, హెలీకాప్టర్, ప్రైవేట్ జెట్ ఉన్నాయి. వాస్తవానికి ఈ వస్తువుల్ని దేశీయంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల ఈ వస్తువుల దిగుమతి తగ్గి..ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర భారత్ మిషన్ పటిష్టం కానుంది.
ఇంతకుముందు 2022లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఈ వస్తువులపై ట్యాక్స్ పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ వేర్వేరు శాఖలతో సమాచారం రప్పించుకుంది. ఇందులో ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాల్సిన వస్తువులున్నాయి. సెప్టెంబర్‌లో ముగిసిన త్రైమాసికంలో ప్రస్తుత బడ్జెట్ పెరిగి 4.4 శాతానికి చేరుకుంది.
ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల ప్రస్తుత బడ్జెట్ కోతలో ఉపశమనం లభిస్తుంది. దాంతో రానున్న కాలంలో ఆర్ధికవ్యవస్థ పటిష్ఠమౌతుంది. ఐఎంఎఫ్ ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసిందాని ప్రకారం ఈ ఏడాది ప్రపంచంలోని మూడింట దేశాల్లో మాంద్యం ఏర్పడనుంది. ఐఎంఎఫ్ సూచనల ప్రకారం మాంద్యం ప్రభావం ఇండియాపై కూడా పడనుంది.
Also read: Public Provident Fund: పీపీఎఫ్‌లో పెట్టుపెడి పెట్టే వరకు గుడ్‌న్యూస్.. ఆ డిమాండ్‌కు అంగీకరిస్తే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook