ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Last Updated : Jul 7, 2018, 06:16 PM IST
ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు 93వ చీఫ్‌ జస్టిస్‌గా (ఉమ్మడి హైకోర్టుకు రాధాకృష్ణన్‌ 4వ సీజే)ఆయన ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, న్యాయమూర్తులు, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌కు గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలను తెలిపారు. 1959 ఏప్రిల్‌ 29న జన్మించిన రాధాకృష్ణన్‌.. కర్ణాటక కేజీఎఫ్‌ లా కాలేజీనుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. 2004లో కేరళ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.  2017లో ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు.

Trending News