Vande Bharat Express: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్లు.. బోగీల అద్దాలు ధ్వంసం!

Stones pelting onVande Bharat Train at Vizag. వందే భారత్‌ ఎక్స్‌ప్రైస్‌ రైలుపై విశాఖలో దాడి జరిగింది. కంచరపాలెం రామ్మూర్తిపంతులు పేట వద్ద ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 11, 2023, 10:02 PM IST
  • విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్లు
  • బోగీల అద్దాలు ధ్వంసం
  • ఆకతాయిల కోసం రైల్వే పోలీసుల గాలింపు
Vande Bharat Express: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్లు.. బోగీల అద్దాలు ధ్వంసం!

Stones pelted on Vande Bharat Express Train in Visakhapatnam: వందే భారత్‌ ఎక్స్‌ప్రైస్‌ రైలుపై విశాఖలో దాడి జరిగింది. బుధవారం (జనవరి 11) కొందరు ఆకతాయిలు రాళ్లు విసిరారు. విశాఖలోని కంచరపాలెం రామ్మూర్తిపంతులు పేట వద్ద ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్‌ రైలు రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. రైలుపై రాళ్లు విసిరిన ఆకతాయిల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు. 

సికింద్రాబాద్‌, విశాఖపట్నం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ.. వందే భారత్‌ ఎక్స్‌ప్రైస్‌ రైలును 2022 జనవరి 19న ప్రారంభించాల్సి ఉంది. ట్రయల్‌ రన్‌లో భాగంగా బుధవారం చెన్నై నుంచి విశాఖ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. సిబ్బంది, రైల్వే అధికారులు పరిశీలించిన అనంతరం సాయంత్రం విశాఖ స్టేషన్‌ నుంచి మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా.. కంచరపాలెం రామ్మూర్తిపంతులు పేట వద్ద కొందరు ఆకతాయిలు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్‌ రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించి కేసు నమోదు చేశారు. డీఆర్‌ఎం అనూప్‌ సత్పతి ఘటనపై విచారణకు ఆదేశించారు. రాళ్లదాడిని వాల్తేరు డివిజన్‌ అధికారులు నిర్ధారించారు. రైలుపై రాళ్లు విసిరిన ఆకతాయిల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Also Read: Uppal Stadium Tickets: ఉప్పల్‌ స్టేడియంలో వన్డే మ్యాచ్‌.. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం! పూర్తి వివరాలు ఇవే

Also Read: SuryaKumar Yadav 900 Rating Points: సూర్యకుమార్‌ యాదవ్‌ అరుదైన రికార్డు.. మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News