/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

India vs Sri Lanka 3rd T20 Match Preview: టీమిండియా, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ శనివారం సాయంత్రం 7 గంటల నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమనంగా ఉన్నాయి. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. సొంతగడ్డపై శ్రీలంకు కూడా సిరీస్ కోల్పోయేందుకు టీమిండియా ఏమాత్రం సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. 

రెండు మ్యాచ్‌ల్లోనూ టాప్ ఆర్డర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో చివరి మ్యాచ్‌కు గిల్‌ను పక్కనబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో మూడోస్థానంలో వచ్చి విఫలమైన రాహుల్ త్రిపాఠికి మరో ఛాన్స్ దక్కవచ్చు. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫామ్‌లో రావడం సానుకూలాంశం. అతనికి తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. 

ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మరోసారి కీలకం కానున్నాడు. గత మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు పరువు కాపాడాడు. టీమిండియా ఆందోళన అంతా బౌలింగ్‌పైనే ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గత మ్యాచ్‌లో ఏకంగా ఐదు నోబాల్స్ వేసి ఓటమి ప్రధాన కారణమయ్యాడు. 2 ఓవర్లలోనే 37 పరుగులిచ్చాడు. దీంతో మూడో మ్యాచ్‌కు అర్ష్‌దీప్‌ను పక్కనబెట్టి.. మరో ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌ నాలుగు వికెట్లతో అదరగొట్టిన శివమ్ మావీ రెండో మ్యాచ్‌లో తేలిపోయాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు. మరోసారి అతను వికెట్లు తీయాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ కూడా గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. 

స్పిన్నర్ చాహల్‌కు తుది జట్టులో స్థానం అనుమానంగా మారింది. రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. స్పిన్‌కు అనుకులించే టీమిండియా పిచ్‌లపై చాహల్ విఫలమవ్వడం అభిమానులు జీర్ణించులేకపోతున్నారు. దీంతో చివరి మ్యాచ్‌కు చాహల్ స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సుందర్‌ను జట్టులోకి తీసుకుంటే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు కలిసి వస్తుంది. చూడాలి మరి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఏ నిర్ణయం తీసుకుంటాడో. 

భారత్ తుది జట్టు (అంచనా): ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్/రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, వాషింగ్టర్ సుందర్/చాహల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్/ముఖేష్ కుమార్

Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. వసతి గదుల అద్దె భారీగా పెంపు  

Also Read: Tunisha Sharma Death: తునీషా శవమై ఉంటే సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో షీజాన్ ఛాటింగ్.. గంట పాటు అలాగే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
India vs sri lanka 3rd t20 match preview team india playing 11 captain hardik pandya may give chance to rutuhuraj kaikwad in place of shubman gill
News Source: 
Home Title: 

IND Vs SL: శ్రీలంకతో నేడే ఆఖరి ఫైట్.. ఈ మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..?
 

IND Vs SL: శ్రీలంకతో నేడే ఆఖరి ఫైట్.. ఈ మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..?
Caption: 
Ind Vs SL (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

శ్రీలంకతో నేడు ఫైనల్ టీ20 మ్యాచ్

టీమిండియా తుది జట్టులో మార్పులు

ఈసారి అరంగేట్రం చేసే ప్లేయర్ ఎవరంటే..?

Mobile Title: 
IND Vs SL: శ్రీలంకతో నేడే ఆఖరి ఫైట్.. ఈ మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, January 7, 2023 - 07:29
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
30
Is Breaking News: 
No