Grah Gochar 2023: మకర రాశిలో తండ్రీ కొడుకుల కలయిక.. ఈ రాశులపై ప్రతికూల ప్రభావం..

Grah Gochar 2023: సూర్యుడు మకరరాశిలోకి వెళ్లడం వల్ల కొన్ని రాశుల వారికి అశుభం కలుగుతుంది. కాబట్టి సూర్యుడు ఏ రాశుల మీద తన ప్రభావాన్ని చూపుతాడో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 04:58 PM IST
Grah Gochar 2023: మకర రాశిలో తండ్రీ కొడుకుల కలయిక.. ఈ రాశులపై ప్రతికూల ప్రభావం..

Grah Gochar 2023: జనవరి 14న సూర్యుడు ధనుస్సు రాశి నుండి బయటకి వెళ్లి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే శనిదేవుడు మకరరాశిలో ఉంటాడు. అంటే మకర రాశిలో తండ్రీ కొడుకుల కలయిక ఏర్పడుతుంది. వీరద్దరి కలయిక  నాలుగు రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మకర సంక్రాంతికి ఏ 4 రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందో తెలుసుకుందాం. 

జనవరి 17న మళ్లీ శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మిథునం మరియు తుల రాశులపై ధైయా ముగుస్తుంది. కర్కాటక, వృశ్చిక రాశి వారిపై ధైయా ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ధనుస్సు రాశివారికి శని సడే సతి నుండి విముక్తి లభిస్తుంది. మకర, కుంభ, మీన రాశులపై శని సడేసతి ప్రారంభమవుతుంది. 

సింహ రాశి (Leo); సూర్యుని సంచార సమయంలో మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఎవరికీ అవసరానికి మించి డబ్బు ఇవ్వకండి, ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీరు కుటుంబంలో అనుహ్యకరమైన వార్తలను వింటారు. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మీరు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. 
తులారాశి (Libra): సూర్యుని సంచారం వల్ల తుల రాశి వారి కుటుంబ జీవితం ప్రభావితమవుతుంది. మీ ఫ్యామిలీలో విభేదాలు తలెత్తుతాయి. మీరు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. మీరు బంధువులు లేదా మిత్రుల నుండి బ్యాడ్ న్యూస్ వినే అవకాశంఉంది. మీరు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఓపిగ్గా ఉండండి. 

ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి వారు సూర్యుని సంచార సమయంలో కొన్ని ఊహించని ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ మాటలను అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. 
కుంభ రాశి (Aquarius): కుంభ రాశి వారికి సూర్యుని సంచారం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సూర్యుని యొక్క అశుభ ప్రభావాల కారణంగా మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాసం ఉంది. ఈ సమయంలో ఎవరికీ అప్పుగా ఇవ్వకండి, లేకుంటే మీరు ఆర్థికంగా నష్టపోతారు. వివాదాస్పద విషయాలను తమలో తాము పరిష్కరించుకోవడం మంచిది. 

Also Read: Ketu Gochar 2023: కేతువు స్థానంలో పెను మార్పు... ఈ రాశులకు ఏడాదంతా డబ్బే డబ్బు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Trending News