Best Recharge Plans: తక్కువ ధరకే ఏడాదిపాటు రోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, సూపర్ రీచార్జ్ ప్లాన్ కదా

Cheap and Best Recharge Plans: ఇంట్లో ఎంత మంది కుటుంబసభ్యులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో ఫోన్ ఉంటున్నాయి. దానికితోడు ఎవరి అవసరాలు వారికి ఉంటున్నాయి. దీంతో ఫోన్‌తో పాటు ఫోన్‌కి రీచార్జ్ అనేవి తప్పనిసరి అవసరాలయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 10:35 PM IST
Best Recharge Plans: తక్కువ ధరకే ఏడాదిపాటు రోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, సూపర్ రీచార్జ్ ప్లాన్ కదా

Cheap and Best Recharge Plans: మొబైల్ ఫోన్స్ వచ్చిన కొత్తలో రీచార్జ్ కార్డ్స్ తక్కువ ధరలో వివిధ టారిఫ్‌ల కింద లభ్యమయ్యేవి. ఆ తరువాత మొబైల్ ఫోన్స్ వినియోగం విరివిగా పెరిగిపోవడంతో పాటు రిలయన్స్ జియో రాకతో టెలికాం ఆపరేటర్స్ మధ్య భారీగా పోటీ పెరగడంతో రీచార్డ్ కార్డ్స్‌పై ఆఫర్స్ లభిస్తుండేవి. ప్రస్తుతం మనం చూస్తోన్న మూడో దశలో రీచార్జ్ ప్లాన్స్ టారిఫ్స్ మరీ ఖరీదైన వ్యవహారం అయిపోయింది. ఇదివరకు కొన్ని రోజుల పాటు మొబైల్ రీచార్జ్ చేయకున్నా.. ఇన్‌కమింగ్ లభించేది. కానీ ఇటీవల ఆ గడువు కూడా తగ్గించడంతో మొబైల్ ఫోన్స్‌కి క్రమం తప్పకుండా రీచార్జ్ తప్పనిసరి అయిపోయింది. 

ఇంట్లో ఎంత మంది కుటుంబసభ్యులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో ఫోన్ ఉంటున్నాయి. దానికితోడు ఎవరి అవసరాలు వారికి ఉంటున్నాయి. దీంతో ఫోన్‌తో పాటు ఫోన్‌కి రీచార్జ్ అనేవి తప్పనిసరి అవసరాలయ్యాయి. ఇది డబ్బున్న వారికి పెద్దగా సమస్య అనిపించకపోవచ్చు కానీ సాధారణ, దిగువ, మధ్య తరగతి కుటుంబాలు మాత్రం ఏ రీచార్జ్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఎంత కాలం వ్యాలిడిటీ ఉంటుంది, రోజుకు ఎంత డేటా వస్తుంది, అన్‌లిమిటెడ్ కాల్స్ వర్తిస్తాయా లేదా లేదంటే ఒక్కో కాల్‌కి ఎంత చార్జ్ అవుతుంది అని లెక్కలేసుకుని మరీ టారిఫ్‌ని నిర్ణయించుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. 

రీచార్జ్ ప్లాన్స్ ఖరీదైన వ్యవహారంలా మారిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే ప్రభుత్వరంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కొన్ని రీచార్జ్ ప్లాన్స్‌ని తక్కువ టారిఫ్స్‌కే అందిస్తోంది. అందులో ఒకటి బిఎస్ఎన్ఎల్ రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్. 797 రూపాయలతో వస్తోన్న ఈ రీచార్జ్ 365 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. అంతేకాకుండా రోజుకు 2GB ఇంటర్నెట్ డేటా సదుపాయం కూడా అందిస్తోంది. ఇక వాయిస్ కాలింగ్ విషయానికొస్తే.. 365 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది. హై స్పీడ్ డేటా లిమిట్ పూర్తయితే.. ఆ తరువాత నుంచి 40Kbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. 

ఇక ఎస్ఎంఎస్‌ల విషయానికొస్తే.. ఈ రూ 797 టారిఫ్ ప్యాకేజీతో నిత్యం 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. కాకపోతే ఈ టారిఫ్ దేశ వాణిజ్య రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీలో ఉండే బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్‌కి మాత్రమే వర్తిస్తుంది అని భారత్ సంచార్ నిగం లిమిటెడ్ స్పష్టంచేసింది. మిగితా ప్రైవేటు ఆపరేటర్స్‌తో పోల్చుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటితో, 2GB డేటాతో, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో చౌక ధరలో లభించే చీప్ అండ్ బెస్ట్ రీచార్జ్ ప్లాన్ మాత్రం ఇదే అనుకోవచ్చు. 

Trending News