Vastu Tips: బకెట్ నీళ్లతో అప్పులు దూరం చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా

Vastu Tips: చాలా మంది అప్పుల్లో కూరుకుపోతుంటారు. ఎంత ప్రయత్నించినా అప్పులు తీరవు. అందుకే ప్రయత్నాలతో పాటు కొన్ని పద్ధతులు కూడా పాటించాలంటున్నారు వాస్తు నిపుణులు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 5, 2023, 04:54 PM IST
Vastu Tips: బకెట్ నీళ్లతో అప్పులు దూరం చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా

జ్యోతిష్యం ప్రకారం అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం వాస్తుదోషం కూడా ఉంటుంది. అందుకే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే నీటితో ముడిపడి ఉన్న కొన్ని ఉపాయాలు తప్పకుండా ఆచరించాల్సి ఉంటుందట.

జ్యోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రం ప్రకారం చాలా సమస్యలకు ఉపాయాలున్నాయి. అవన్నీ నమ్మకాల్ని బట్టి ఉంటాయి. కొంతమంది నమ్మవచ్చు. కొంతమంది మూఢ నమ్మకమని తీసిపారేయవచ్చు. ఎవరి నమ్మకాలు వారివి. నమ్మకంతో ఆచరిస్తే అన్నీ సాధ్యమౌతాయంటోంది వాస్తుశాస్త్రం. జీవితంలో ఎదురయ్యే చాలా కష్టాలకు కారణం వాస్తుదోషమనేది వాస్తుశాస్త్రం చెప్పే మాట. అందులో భాగంగానే అప్పుల్లో కూరుకుపోవడమనేది వాస్తుదోషం అంటున్నారు జ్యోతిష్య పండితులు. 

వాస్తు శాస్త్రం ప్రకారం నీళ్లు వృధా చేయడం వాస్తుదోషమౌతుంది. మీ ఇంట్లో లేదా మీరు అదే పనిగా నీళ్లు వృధా చేస్తుంటే డబ్బుల కొరత వెంటాడుతుంది. ఆర్ధిక కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా నీళ్లు ట్యాంకును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది కూడా వాస్తుదోషానికి కారణమే. నీళ్ల ట్యాంకు శుభ్రంగా లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి.

మీ ఇంటి బాత్రూమ్ ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి. స్నానం చేసిన తరువాత బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల దేవుడి అనుగ్రహముంటుంది. వాస్తు దోషం కూడా దూరమౌతుంది. బాత్రూమ్‌లో ఎప్పుడూ నీలిరంగు బకెట్ ఉంచడం శుభసూచకమౌతుంది. బకెట్‌లో ఎప్పుడూ కొద్దిగా నీళ్లు ఉండేట్టు చూసుకోవాలి. ఖాళీగా ఉంచకూడదు.

వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూమ్‌లో అద్దం ఉంటే వాస్తుదోషం పెరుగుతుంది. నెగెటివ్ ప్రభావం పడుతుంది. అందుకే అద్దం లేకుండా చూసుకోవాలి. ఈ సూచనలన్నీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చెబుతున్నవే. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రాల్ని నమ్మేవారికే ఇవి వర్తిస్తాయి. 

Also read: Dreams Meaning: కలలో ఇంద్ర ధనస్సు కన్పిస్తే అర్ధమేంటి, దాని వెనుక దాగిన రహస్య సంకేతాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News