Surya Gochar 2023: గ్రహాల రాజైన సూర్యభగవానుడి గమనంలో మార్పు రానుంది. ఆస్ట్రాలజీలో సూర్యుడిని విజయం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం మరియు తండ్రికి కారకుడిగా భావిస్తారు. సూర్యుడు తన రాశిని మార్చుకుని మరో రాశిలోకి ప్రవేశించినప్పుడల్లా దానిని సంక్రాంతి అంటారు. జనవరి 14, 2023న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మకర సంక్రాంతి (Makar Sankranti 2023) అంటారు. మకర రాశికి అధిపతి శనిదేవుడు. పైగా అదే రాశిలో శనిదేవుడు సంచరిస్తున్నాడు. సూర్యభగవానుడు శని యెుక్క తండ్రి. జ్యోతిష్యశాస్త్రంలో వీరిద్దరినీ శత్రువులగా భావిస్తారు. మకరరాశిలో సూర్యుడు మరియు శని కలయిక 4 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus): వృషభ రాశి వారికి సూర్యుని సంచారం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వీరు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా లాభాలను సాధిస్తారు. మీరు ఏ పని చేపట్టినా అదృష్టం కలిసి వచ్చి దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
మిథునం(Gemini): సూర్యుని రాశి మార్పు మిథున రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఆఫీసులో సహోద్యోగులు సపోర్టు లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాదిస్తారు. ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారస్తులు బిజినెస్ లో రాణిస్తారు.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి సూర్య సంచార ప్రభావం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ లవర్, లైఫ్ పార్టనర్ యెుక్క మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మకరం (Capricorn): సూర్యుని సంచారం మకరరాశిలో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యక్తుల జీవితాల్లో సానుకూలత ఉంటుంది. పాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగం దూరమవుతుంది. కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది.
Also Read: Guru Uday 2023: మీనంలో ఉదయించబోతున్న బృహస్పతి.. ఈ 3 రాశులవారికి మంచి రోజులు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.