ట్విట్టర్, టెస్లా సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ తన సంపదలో ఏకంగా 2 వందల బిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు. ఇంత భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న తొలి వ్యక్తి బహుశా ఎలాన్ మస్క్‌నే.
ఏకంగా 2 వందల బిలియన్ డాలర్లు పోగొట్టుకోవడంతో ఎలాన్ మస్క్ నెట్ సంపాదన తరిగి..137 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు దాదాపుగా 65 శాతం క్షీణించింది. 2021లో అత్యంత ధనికుడైన ఎలాన్ మస్క్ ర్యాంకింగ్ తగ్గిపోయింది. 2021లో ఎలాన్ మస్క్ తొలిసారిగా 185 బిలియన్ డాలర్ల సంపాదన దాటేశారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
ఇటీవల డిసెంబర్ నెలలో ఎలాన్ మస్క్ స్థానంలో లగ్జరీ బ్రాండ్ లూయిస్ వుయిటన్ కంపెనీ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ ప్రపంచ ధనికుడిగా మారారు. ట్విట్టర్ సంస్థను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తరువాత..టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపాదన ఇంకా తగ్గిపోయింది.
ఈ అంశంపై ట్విట్టర్‌లో పెద్దఎత్తున కామెంట్లు వస్తున్నాయి. భారీగా డబ్బులు పోగొట్టుకున్న ఎలాన్ మస్క్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. అదే సమయంలో నెటిజన్ల కామెంట్లకు ఎలాన్ మస్క్ కూడా అంతే వ్యంగ్యంగా సమాధానాలిస్తున్నారు. టెస్లా 3 కంపెనీ ఇటీవల తన వాహనాలపై 7500 డాలర్ల డిస్కౌంట్ అందించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook