Trigrahi Yog 2023: జనవరిలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Trigrahi Yog 2023: కొత్త ఏడాదిలో మకరంలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 11:38 AM IST
Trigrahi Yog 2023: జనవరిలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Trigrahi Yog In Capricorn 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు రాశిచక్రాలను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. జనవరి 14న మకరరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. శని, శుక్ర, సూర్యభగవానుల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ఈ యోగం వల్ల నూతన సంవత్సరంలో మూడు రాశులవారికి వృత్తి మరియు వ్యాపారపరంగా శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. 

మేష రాశిచక్రం (Aries): మేష రాశి వారికి త్రిగ్రాహి యోగం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో పదో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు కొత్త జాబ్ ఆఫర్ ను పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో మీకు డబ్బు, పదవి రెండూ లభిస్తాయి. వ్యాపారులు భారీగా లాభాలను సాధిస్తారు. మీరు బిజినెస్ విస్తరించే అవకాశం  ఉంది. మీ ఫ్యామిలీతో సంబంధాలు మెరుగుపడతాయి. 

వృషభ రాశి (Taurus): త్రిగ్రాహి యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. మీరు ఆస్తి నుండి లాభం పొందుతారు. 

మీన రాశిచక్రం (Pisces): త్రిగ్రాహి యోగం మీన రాశి వారికి వృత్తి మరియు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త వనరుల ద్వారా మీ ధనం పెరుగుతుంది. ఈ నెలలో మీనరాశి వారిపై శని సాడే సతి ప్రారంభం అవుతుంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. 

Also Read: Budh Gochar 2023: జనవరిలో ఈ 5 రాశులవారికి బ్యాడ్ డేస్ స్టార్ట్.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News