Samantha Ruth Prabhu Inspirational Quotes సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి వల్ల సమంత ఎక్కువగా బయటకు రాలేకపోతోంది. సినిమా షూటింగ్‌లన్నీ కూడా మూలకు పడ్డాయి. కొత్త సినిమాలేవీ సైన్ చేయడం లేదు. దీంతో సమంత చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పక్కకి వెళ్తున్నాయి. విజయ్ దేవరకొండ చేయాల్సిన ఖుషి సినిమా మాత్రం అలా పెండింగ్‌లో ఉండిపోయింది.
సమంత ఆ మధ్య సోషల్ మీడియాలో ఇన్ యాక్టివ్‌గా ఉండిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ సమంత యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఓ పోస్ట్ వేసింది. ఏది ఏమైనా ముందుకు వెళ్లాల్సిందే.. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి.. న్యూ ఇయర్‌కు మనం ఏం తీర్మానించుకున్నామో గుర్తు చేసుకోండి.. మళ్లీ కొత్తవి తీర్మానించుకోండన్నట్టుగా సమంత చెప్పుకొచ్చింది.
అయితే ఇప్పుడు సమంత ఓ పోస్ట్ వేసింది. తన ఇన్ స్టా స్టోరీలో సద్గురు చెప్పిన కొటేషన్‌ను షేర్ చేసింది. స్వర్గంకు వెళ్లాలంటే అక్కడ రెండు ప్రశ్నలు అడుగుతారట. ఆ రెండింటికి యస్ అని సమాధానం చెబితే.. స్వర్గంలోకి పంపిస్తారట. నువ్ సంతోషంగా ఉన్నావా?, నీ చుట్టు పక్కల ఉన్న వారిని సంతోషంగా ఉంచావా? అని అడుగుతారట. ఈ రెండింటికి యస్ అని సమాధానాలు చెబితే.. నువ్ ఆల్రెడీ స్వర్గంలో ఉన్నట్టేగా అని అర్థం కదా? అని సద్గురు చెప్పుకొచ్చాడు.
ఇక సమంత అయితే వచ్చే ఏడాది ఎలాంటి కొత్త సినిమాను సెలెక్ట్ చేసుకోబోవడం లేదని తెలుస్తోంది. సమంత ఇప్పుడు కమిట్ అయిన విజయ్ ఖుషి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటోందట. కానీ అది కూడా అవుతుందా? లేదా? అన్నది తెలియడం లేదు. సమంత పూర్తిగా కోలుకుంటేనే మళ్లీ సెట్స్ మీదకు అడుగు పెట్టే అవకాశం ఉంది.
Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి