/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Bus Driver Sushil Mann saved Cricketer Rishabh Pant After Horrific Car Accident: ఉత్త‌రాఖండ్‌లోని రూర్కీ సమీపంలోని మహమ్మద్‌పూర్ జాట్‌లో టీమిండియా క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ కారు ఈరోజు ఉదయం ప్ర‌మాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా పంత్ న‌డుపుతున్న మెర్సిడీజ్ ఎస్‌యూవీ ఢివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్ర‌మాదం జ‌రిగిన కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న పంత్‌ను.. సుశీల్ మాన్ అనే బ‌స్సు డ్రైవ‌ర్ ర‌క్షించాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. ప్రమాద సమయంలో ఏం జరిగిందో బ‌స్సు డ్రైవ‌ర్ మాటల్లో ఓసారి చూద్దాం. 

'నేను హరిద్వార్‌ నుంచి వస్తున్నాను. రిషబ్ పంత్‌ కారు ఢిల్లీ వైపు నుంచి వస్తోంది. పంత్‌ కారు డివైడర్‌ను ఢీకొని 200 మీటర్లు దూసుకెళ్లింది. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపేసి.. కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లా. ముందుగా నేను కారు బోల్తాపడిందనుకొన్నాను. పంత్‌ అప్పటికే కారు విండో పగలగొట్టి సగం బయటకు వచ్చాడు. తాను క్రికెటర్‌నని నాతో చెప్పాడు. అతడి తల్లికి ఫోన్‌ చేయమన్నాడు. నేను క్రికెట్‌ చూడను కాబట్టి అతడిని గుర్తుపట్టలేకపోయా. కానీ బస్సులోని వారు గుర్తుపట్టారు. పంత్‌ను వెంటనే బయటకు లాగాము' అని బ‌స్సు డ్రైవ‌ర్ సుశీల్ మాన్ ఓ జాతీయ మీడియాకు తెలిపాడు. 

'రిషబ్ పంత్‌ను బయటికి తీసేటప్పకే కారుకు మంటలు అంటుకున్నాయి. పంత్‌ను కారులో నుంచి బయటికి లాగాక.. లోపల ఇంకెవరైనా ఉన్నారేమో చూశాను. కారులో ఇంకెవరు లేరు. పంత్ నీలం రంగు బ్యాగ్‌ ఉండగా.. దాన్ని బయటికి తీసుకొచ్చాం. అందులో రూ.7,000 నగదు  ఉంది. బ్యాగ్‌, డబ్బును అంబులెన్స్‌లో అతడికి అప్పగించాం. ప్రమాద సమయంలో పంత్‌ తీవ్రంగా గాయపడి నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. తలకు గాయం అయింది' అని బ‌స్సు డ్రైవ‌ర్ సుశీల్ మాన్ చెప్పాడు. డ్రైవింగ్ చేస్తూ నిద్ర మ‌త్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పంత్‌ నుదురు చిట్లినట్లు, వీపుపై కాలిన గాయాలు అయినట్లు పేర్కొంది. అంతేకాదు కుడి మోకాలి లిగ్మెంట్‌ స్థానభ్రంశమైనట్లు ఎక్స్‌రేల్లో తెలిసినట్లు తెలిపింది. అయితే పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బీసీసీఐ చెప్పింది. 

Also Read: Cheap Hyundai Creta Cars: రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ లేదు.. రూ. 7 లక్షలకే హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి!  

Also Read: Rishabh Pant Accident: ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ కారు భద్రతా ఫీచర్లు ఇవే.. ధర కోటి కంటే ఎక్కువ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Section: 
English Title: 
Rishabh Pant Car Accident: Bus Driver Sushil Mann saved Cricketer Rishabh Pant After Horrific Car Accident
News Source: 
Home Title: 

Rishabh Pant Rescuer: రిషబ్ పంత్‌ను కాపాడింది ఎవరో తెలుసా.. ఇంతకీ రోడ్డుపై ఏం జరిగిందంటే?
 

Rishabh Pant Rescuer: రిషబ్ పంత్‌ను కాపాడింది ఎవరో తెలుసా.. ఇంతకీ రోడ్డుపై ఏం జరిగిందంటే?
Caption: 
Source: Twitter
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

రిషబ్ పంత్‌ వీపుపై కాలిన గాయాలు

పంత్‌ను కాపాడింది ఎవరో తెలుసా

ఇంతకీ రోడ్డుపై ఏం జరిగిందంటే?
 

Mobile Title: 
రిషబ్ పంత్‌ను కాపాడింది ఎవరో తెలుసా.. ఇంతకీ రోడ్డుపై ఏం జరిగిందంటే?
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Friday, December 30, 2022 - 18:01
Request Count: 
64
Is Breaking News: 
No