ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదం: 47కి పెరిగిన మృతుల సంఖ్య

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్) ప్రకారం, ఉత్తరాఖండ్ లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 47కి పెరిగింది.

Last Updated : Jul 2, 2018, 03:49 PM IST
ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదం: 47కి పెరిగిన మృతుల సంఖ్య

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్) ప్రకారం, ఉత్తరాఖండ్‌లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 47కి పెరిగింది. ఈ ఉదయం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిన సంగతి విదితమే. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొలుత 35 మంది మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి. 11 మంది గాయపడ్డారని.. వీరిలో తొమ్మిది మంది ధూమకోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఇద్దరినీ ఉత్తరాఖండ్ రామ్నానగర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  

సీఎం పరామర్శ

ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో 30 మంది దుర్మరణం పాలైన ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఆయన ఘటనాస్థలికి వెళ్లి స్యయంగా పరిస్థితిని సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బస్సులోయలో పడిన సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు నష్టపరిహారాన్ని రావత్ ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య సహాయాన్ని అందిస్తామని చెప్పారు.

ప్రధాని దిగ్భ్రాంతి

ఉత్తరాఖండ్ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవంలందించాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Trending News