Rishabh Pant Car Accident: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం జరిగింది. రూర్కీలోని నర్సన్ సరిహద్దు వద్ద హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలో పంత్ కారు రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు, కాలు, వీపునకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పంత్ ప్రమాదానికి ప్రధాన కారణం వెలుగులోకి వచ్చింది.
రిషబ్ పంత్ స్వయంగా కారు నడుపుతూ ఒంటరిగా వచ్చాడు. కారు నడుతున్న సమయంలో కాస్త నిద్ర పట్టడంతో కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. కళ్లు మూయడంతో రెప్పపాటులో బ్యాలెన్స్ తప్పి.. రైలింగ్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పంత్ కారు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో పంత్ అలానే ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియాలో వేదికగా కోరుకుంటున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే పంత్‌ను రూర్కీలోని ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌కు రెఫర్ చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి తరలించినట్లు తెలిసింది. అతని కుడి కాలులోని లిగమెంట్ నలిగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం పంత్ పరిస్థితి నిలకడగా ఉంది.
రిషబ్ పంత్ ఇప్పటికే మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ గాయం కారణంగానే రాబోయే శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాల్సి ఉంది. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం పంత్ గాయాన్ని చూస్తుంటే.. వచ్చే కొన్ని నెలల పాటు క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
రిషబ్ పంత్ 2022లో టీమిండియా తరఫున మొత్తం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో కూడా టెస్టు సిరీస్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 12 వన్డేల్లో 37.33 సగటుతో 336 రన్స్ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో 25 మ్యాచ్‌లు ఆడి.. 21.41 సగటుతో 364 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read: Rishabh Pant: రోడ్డుప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలు.. కాలి బూడిదైన కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rishabh Pant: రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి అసలు కారణం ఇదే.. కారు అద్దాలు పగలగొట్టి మరీ..