Connect Movie: నయనతార కనెక్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్ విడుదల ఎప్పుడంటే

Connect Movie: దక్షిణాది స్టార్ నటిగా ప్రాచుర్యం పొందిన నయనతార లేటెస్ట్ సినిమా ఇటీవల విడుదలైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడు, ఎందులో అనేది తేలిపోయింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2022, 10:52 PM IST
Connect Movie: నయనతార కనెక్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్ విడుదల ఎప్పుడంటే

తెలుగు, తమిళ, మలయాళ సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న మలయాళ కుట్టి నయనతార 17 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. నయనతార ఇటీవలి చిత్రం కనెక్ట్ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతోంది.

దక్షిణాది సినిమాలో తనకంటూ ప్రత్యేక  గుర్తింపు, లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. భర్త విఘ్నేష్ శివన్‌‌తో కలిసి పలు సినిమాలు నిర్మిస్తున్న నయనతార ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి సారించింది. నయనతార లేటెస్ట్ సినిమా కనెక్ట్ డిసెంబర్ 22న ధియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో హీరో వినయ్ రాయ్, సత్యరాజ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలు పోషించారు. 99 నిమిషాల నిడివి కలిగిన సినిమాను యూవీ క్రియేషన్స్ విడుదల చేసింది.

కనెక్ట్ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ధియేటర్‌లో విడుదలైన 4 వారాలకు ఓటీటీలో విడుదల కానుంది. అంటే జనవరి నెలాఖరులో కనెక్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావచ్చు. మరోవైపు ఈ సినిమా డిసెంబర్ 30న ఈ సినిమా హిందీలో కూడా విడుదల కానుంది.

Also read: Aadi Sai Kumar Top Gear : అది రీమేక్ చేయాలని ఉంది.. మనసులోని కోరికను బయటపెట్టేసిన ఆది సాయికుమార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News